
భారత షూటర్ 28 ఏళ్ల నమన్వీర్‌సింగ్ బ్రార్ ఆత్మహత్య చేసుకున్నాడు. సోమవారం ఉదయం మొహాలీలో సెక్టార్ 71 ఇంట్లో ఈ దారుణమైన ఘటన జరిగింది. ఈ ఏడాది మార్చిలో జరిగిన ఢిల్లీ షూటింగ్ వరల్డ్ కప్ లో కనీస అర్హత స్కోరు (MQS) విభాగంలో నమన్వీర్‌సింగ్ నాలుగోస్థానంలో నిలిచాడు. అలాగే 2015లో దక్షిణ కొరియాలోని గ్వాంగ్జులో జరిగిన వరల్డ్ యూనివర్సిటీ గేమ్స్ లో డబుల్ ట్రాప్ షూటింగ్ ఈవెంట్‌లో బ్రాన్జ్ మెడల్ సాధించాడు.