కేసీఆర్ పాలనలో పూటకో అఘాయిత్యం

కేసీఆర్ పాలనలో పూటకో అఘాయిత్యం

జాతీయ మహిళా కాంగ్రెస్ ప్రెసిడెంట్ డిసౌజా
టీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అంటే తెలంగాణ రేప్ సపోర్ట్ పార్టీ

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, వెలుగు: సీఎం కేసీఆర్ పాలనలో రాష్ట్రంలో పూటకో అఘాయిత్యం‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జరుగుతోందని జాతీయ మహిళా కాంగ్రెస్ ప్రెసిడెంట్ డిసౌజా ఆరోపించారు. టీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అంటే తెలంగాణ అఘాయిత్యాల సపోర్ట్ పార్టీ అని ఆరోపించారు. బుధవారం గాంధీభవన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో మౌనదీక్ష నిర్వహించారు. నోటికి నల్ల రిబ్బన్లు కట్టుకొని నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో టీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్, బీజేపీ, ఎంఐఎంలు ఒక్కటేనన్నారు. మహిళలపై దాడులు అరికట్టడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఫెయిల్ ​అయ్యాయన్నారు. రాష్ట్రంలో రోజుకు 6 అఘాయిత్యాలు జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. మైనర్ ఘటన విషయంలో సీఎం, మంత్రులు స్పందించకపోవడం ఏంటని ప్రశ్నించారు. కేసును సీబీఐకి అప్పగించాలని డిమాండ్ చేశారు. అంతకుముందు డీజీపీని కలిసి వినతిపత్రం అందజేశారు. కొండా సురేఖ, రేణుక చౌదరి, సునీత రావ్ తదితరులు పాల్గొన్నారు.