నేషనల్ మినీ హ్యాండ్‌‌‌‌బాల్‌‌‌‌ చాంపియన్‌‌‌‌షిప్‌‌‌‌ షురూ

నేషనల్ మినీ హ్యాండ్‌‌‌‌బాల్‌‌‌‌ చాంపియన్‌‌‌‌షిప్‌‌‌‌ షురూ

హైదరాబాద్‌‌‌‌, వెలుగు: నేషనల్ మినీ హ్యాండ్‌‌‌‌బాల్‌‌‌‌ చాంపియన్‌‌‌‌షిప్‌‌‌‌ హైదరాబాద్ నిజాం కాలేజ్‌‌‌‌ గ్రౌండ్స్‌‌‌‌లో  శుక్రవారం మొదలైంది.  తొలి మ్యాచ్‌‌‌‌లో అస్సాంపై తెలంగాణ ఘన విజయం సాధించింది. అండర్‌‌‌‌-12 బాయ్స్, గర్ల్స్‌‌‌‌ కేటగిరీల్లో 22 రాష్ట్రాల జట్లు పోటీ పడుతున్న ఈ టోర్నీని క్రీడాశాఖ మంత్రి వాకిటి శ్రీహరి ప్రారంభించారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం క్రీడాభివృద్ధికి కట్టుబడి ఉందన్నారు. హ్యాండ్‌‌‌‌బాల్‌‌‌‌ అభివృద్ధికి కూడా ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని  చెప్పారు. ఓపెనింగ్ సెర్మనీలో రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌‌‌‌, శాట్జ్‌‌‌‌ చైర్మన్‌‌‌‌ శివసేనా రెడ్డి,  హెచ్‌‌‌‌ఎఫ్‌‌‌‌ఐ జనరల్‌‌‌‌ సెక్రటరీ ప్రీత్‌‌‌‌పాల్‌‌‌‌ సింగ్‌‌‌‌ సలూజ , తెలంగాణ హ్యాండ్‌‌‌‌‌‌‌‌బాల్‌‌‌‌ సంఘం ప్రెసిడెంట్ మల్‌‌‌‌రెడ్డి రాంరెడ్డి, జనరల్ సెక్రటరీ శ్యామల పవన్‌‌‌‌ కుమార్‌‌‌‌ తదితరులు పాల్గొన్నారు.