అవయవ దాత కుటుంబ సభ్యులను సన్మానించిన హరీష్ రావు

అవయవ దాత కుటుంబ సభ్యులను సన్మానించిన హరీష్ రావు

అవయవ దాతల్లో పేదలు ఉంటే.. ఉచిత చదువు, ఇల్లు ఇచ్చే ప్రయత్నం చేస్తామని మంత్రి హరీష్ రావు అన్నారు. అందరూ ముందుకొచ్చి అవయవ దానాలను ప్రోత్సహించాలని ఆయన చెప్పారు. గాంధీ మెడికల్ కాలేజ్ ఆడిటోరియంలో నేషనల్ ఆర్గన్ డొనేషన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రి హరీష్ రావు, డీఎంఈ రమేష్ హాజయ్యారు. అవయవ దానానికి ముందుకొచ్చిన వారిని హరీష్ రావు సన్మానించారు. 

అవయవ దానం సక్సెస్ కావడానికి డాక్టర్ల సహకారం కావాలని హరీష్ రావు అన్నారు. అవయవ దాతలకు సన్మానం చిన్నదేనని చెప్పారు. మీరు ప్రాణాలు కాపాడుతున్నారు అంటూ వారిని ప్రశంసించారు. ఇప్పటివరకు 3,180 మంది అవయవాలు కావాలని దరఖాస్తు చేసుకున్నారని హరీష్ చెప్పారు. పేషెంట్లు నిర్లక్ష్యం చేయడం వల్లే కిడ్నీలు, లివర్ ఫెయిల్ అవుతుందని హరీష్ రావు అన్నారు.