పీఎఫ్ చందాదారులకు గుడ్ న్యూస్

పీఎఫ్ చందాదారులకు గుడ్ న్యూస్
  • కొత్త విధానం ప్రకటించిన పీఎఫ్​ఆర్​డీఏ

న్యూఢిల్లీ: నేషనల్ పెన్షన్ సిస్టమ్ (ఎన్​పీఎస్​) చందాదారులు లంప్సమ్, యాన్యుటీ మొత్తాన్ని ఇక నుంచి మరింత త్వరగా పొందవచ్చు.  ఆన్​లైన్​లోనే అన్ని పనులూ చేసుకోవచ్చు.  ఇందుకోసం పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌‌‌‌‌‌‌‌‌‌మెంట్ అథారిటీ (పీఎఫ్​ఆర్​డీఏ) జారీ చేసిన ఎగ్జిట్​ ఫారమ్‌‌‌‌ను ఉపయోగించాలి. ఆధార్ / టూ ఫ్యాక్టర్ అథెంటికేషన్ (2ఎఫ్​ఏ) ద్వారా ఈ సంస్థ ఎన్​పీఎస్​ సబ్‌‌‌‌స్క్రైబర్‌‌‌‌లకు డిజిటల్ ఎనేబుల్డ్ ఎగ్జిట్ ఆప్షన్‌‌‌‌లను అందిస్తున్నది.

ఎన్​పీఎస్​ సబ్‌‌‌‌స్క్రైబర్‌‌‌‌లు తమ ఎగ్జిట్​ సమయంలో తప్పనిసరిగా సమర్పించాల్సిన ఆన్‌‌‌‌లైన్/ఆఫ్‌‌‌‌లైన్ విత్​డ్రాయల్​ ఫారమ్​ను ఇకపై యాన్యుటీ ప్రపోజల్​ ఫారమ్‌‌‌‌గా పరిగణిస్తారు. ఈ విషయమై పెన్షన్​ రెగ్యులేటరీ బాడీ ఒక ప్రకటన విడుదల చేసింది. ఎన్​పీఎస్​ విత్​డ్రాయల్​ ఫారమ్‌‌‌‌ను యాన్యుటీ ప్రతిపాదనగా పరిగణించడం ద్వారా యాన్యుటీని జారీ చేసే ప్రక్రియను మరింత ఈజీ చేస్తున్నామని పేర్కొంది.

లంప్ సమ్ పేమెంట్,  యాన్యుటీ జారీ  ఏకకాలంలో కాలంలో జరుగుతాయి. పదవీ విరమణ తర్వాత వెంటనే యాన్యుటీ ద్వారా సంబంధిత ఆదాయాన్ని చెల్లిస్తారు.  దీనివల్ల రిటైల్​మెంట్​ తర్వాత కూడా ఆర్థిక భద్రత ఉంటుంది. 

ఎగ్జిట్​ ఫారమ్‌‌‌‌ను ఎలా ఫైల్ చేయాలంటే?

ఎగ్జిట్​ రిక్వెస్టును మొదలుపెట్టే సమయంలోనే కేవైసీ పత్రాలు సహా ఇతర  సపోర్టింగ్ డాక్యుమెంట్‌‌‌‌లను సిద్ధంగా ఉంచుకోవాలి. వీటితోపాటు నింపిన ప్రపోజల్​ను ఫారమ్‌‌‌‌ను వారి లాగిన్ వివరాల ద్వారా సంబంధిత సీఆర్​ఏ సిస్టమ్‌‌‌‌లో అప్‌‌‌‌లోడ్ చేయాలి.    భవిష్యత్ తేదీతో విత్‌‌‌‌డ్రాయల్ ఫారమ్/డాక్యుమెంట్‌‌‌‌ను అప్‌‌‌‌లోడ్ చేయడం తప్పనిసరి చేయాలని పీఎఫ్​ఆర్​డీఏ  ప్రతిపాదించింది.

పాత పద్ధతికీ కొత్త పద్ధతికీ తేడా ఏంటంటే .. ఇంతకుముందు తమ ఎగ్జిట్​ సమయంలో ఎన్​పీఎస్ సబ్‌‌‌‌స్క్రైబర్‌‌‌‌లు ఆన్‌‌‌‌లైన్/ఆఫ్‌‌‌‌లైన్ విత్​డ్రాయల్​ ఫారమ్​ను  నోడల్ కార్యాలయాలు, పీఓపీలు మొదలైన వాటికి ఇచ్చేవారు.  ప్రస్తుత ప్రక్రియలో, సబ్‌‌‌‌స్క్రైబర్‌‌‌‌లు ఎగ్జిట్​ ఫారమ్‌‌‌‌ను పీఎఫ్​ఆర్​డీఏయే మధ్యవర్తులకు అందజేస్తుంది. వాళ్లు ఎంపిక చేసిన ఏఎస్​పీలకు యాన్యుటీ కోసం దరఖాస్తు చేస్తారు.