బాచుపల్లి ఘటనపై జాతీయ సఫాయి కర్మచారి కమిషన్ సీరియస్..బాధ్యులపై చర్యలు తీసుకుంటాం

బాచుపల్లి ఘటనపై జాతీయ సఫాయి కర్మచారి కమిషన్ సీరియస్..బాధ్యులపై చర్యలు తీసుకుంటాం
  • కమిషన్​ మెంబర్​ కరంసింగ్ ​కర్మ ​

కుత్బుల్లాపూర్​, వెలుగు: బాచుపల్లిలోని దినేశ్​ఆరిక్​అపార్ట్​మెంట్​లో సెఫ్టిక్​ ట్యాంకులో ముగ్గురు కార్మికులు మృతి చెందిన ఘటనలో బాధ్యులైన వారిపై చర్యలు తీసుకుంటామని  సఫాయి కర్మచారి జాతీయ కమిషన్​సభ్యుడు కరంసింగ్​కర్మ స్పష్టం చేశారు. 

ఘటనా స్థలాన్ని గురువారం ఆయన పరిశీలించి ప్రమాదం జరిగిన తీరును అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా అక్కడి సెక్యూరిటీ గార్డులు, హౌజ్​కీపింగ్​కార్మికుల జీతభత్యాల గురించి ఆరాతీశారు. అనంతరం మాట్లాడతూ సెప్టిక్​ ట్యాంక్​ల క్లీనింగ్​కోసం కార్మికుల ప్రాణాలు పణంగా పెట్టడం తీవ్రంగా పరిగణించాల్సిన విషయమన్నారు.

 ఈ ఘటనకు బాధ్యులపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. సెక్యూరిటీగార్డులు, హౌజ్​కీపింగ్​ కార్మికులకు తక్కువ వేతనాలు అందుతున్నట్లు గుర్తించామని , ఈఎస్ఐ , ఫీఎఫ్​కూడా అందడంలేదన్నారు. ఈఎస్​ఐ, పీఎఫ్​లతోపాటు పెరిగిన వేతనాలకు అనుగూణంగా బకాయిలు చెల్లించాలని అదేశించారు. వెంట మనుచౌది, డీసీపీ కోటిరెడ్డి ఉన్నారు.