ఎస్సీల భూములు సిమెంట్ ​ఫ్యాక్టరీ సేకరిస్తే ఏం చేశారు?

ఎస్సీల భూములు సిమెంట్ ​ఫ్యాక్టరీ సేకరిస్తే ఏం చేశారు?

న్యూఢిల్లీ, వెలుగు : ఎస్సీల భూములను ప్రైవేట్ సిమెంట్ ఫ్యాక్టరీ సేకరిస్తుంటే, ఏం చేశారని ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్​సిక్తా పట్నాయక్ పై నేషనల్ ఎస్సీ కమిషన్ సీరియస్ అయింది. బుధవారం యాపల్ గూడ, రాంపూర్ గ్రామంలోని రేణుకా సిమెంట్ ఫ్యాక్టరీ భూ నిర్వాసితుల తరఫున ఆదిలాబాద్ మాజీ జడ్పీ చైర్మన్  సుహాసిని ఎస్సీ కమిషన్ ను ఆశ్రయించారు. దీనిపై విచారించిన కమిషన్ 107 ఎకరాల భూమిని తిరిగి భూ నిర్వాసితులకు ఎందుకు ఇవ్వకూడదో వివరణ ఇవ్వాలని కలెక్టర్ ను ఆదేశించింది.

అలాగే భూసేకరణ సందర్భంలో ఎమ్మెల్యే జోగు రామన్న, ఆర్డీఓ సూర్యనారాయణ ఉన్నారని నిర్వాసితులు కమిషన్ ముందు తెలిపారు. దీనిపై స్పందించిన కమిషన్.. అట్రాసిటీ కేసులు ఎందుకు పెట్టకూడదని అడిగింది.