జాతీయ ఉపాధ్యాయ అవార్డు వివాదాలు

జాతీయ ఉపాధ్యాయ అవార్డు వివాదాలు

ప్ర తిష్టాత్మక ఉపాధ్యాయుల జాతీయ అవార్డ్స్ వ్యవహారం 2020 నుంచి  వివాదస్పద మౌతుంది, అర్హులని ప్రక్కన పెక్కన పెట్టారు. దేశంలో జాతీయ ఉపాధ్యాయ పురస్కారాలు ప్రతి ఏటా అన్ని జిల్లాల   నుంచి రాష్ట్ర విద్యాశాఖకు ప్రతిభ గల ఉపాధ్యాయులు దరఖాస్తులు చేసుకొంటారు. 2019-–20 సంవత్సరం జాతీయ అవార్డు కై  ఎల్లారెడ్డి సంక్షేమ గురుకులంలో ఫిజికల్ డైరెక్టర్ గా పనిచేసిన బొమ్మరౌతు నర్సింగరావు, రాష్ట్ర అవార్డ్ పొందిఉన్నారు. ప్రశంసా పత్రాలు పొందారు.  నర్సింగరావు క్రీడలు, ఎన్​సీసీతో పాటు ఆయా రంగాల్లో సేవలందించారు. స్వంత నిధులతో ఇటుక బట్టి కార్మికుల పిల్లలకు ప్రత్యేక పాఠశాల ఏర్పాటు, పిల్లలకు సెలవురోజుల్లో యోగ, ప్రాణాయామం, మానసిక ఉల్లాసాన్ని ఇచ్చే క్రీడల నిర్వహణ, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాలు, యోగ, పాఠశాలకు రూ.35 వేలతో క్రీడా మైదానంలో మెట్ల నిర్మాణం చేయించారు. విద్యార్థులతో మమేకమై వారి తల్లి దండ్రుల మధ్యన ‘క్వెస్ట్’ ప్రోగ్రాంలో భాగంగా గ్రామీణ ప్రాంతాల్లో పర్యటించి పాఠశాల మానివేసిన విద్యార్థులతో పాటు తల్లి,తండ్రి తో సమావేశాలు ఏర్పాటు చేశారు. కేంద్ర ప్రభుత్వ నియమ నిబంధనలకు లోబడి జాతీయ ఉపాధ్యాయ అవార్డు ప్రొఫార్మా  ప్రకారం అన్ని రంగాల్లో ఆరి తేరిన నర్సింగరావు ఆన్​లైన్​ లో దరఖాస్తు చేసుకున్నారు. ఫొటోలు, వీడియోలు  కూడా  అప్లోడ్ చేసినారు. జనవరి 2020లో పదవీ విరమణ పొందినారు. పదవీ విరమణ పొందే ఉపాధ్యాయుడికే కేంద్ర ప్రభుత్వ నియమ నిబంధనాల ప్రకారం జాతీయ అవార్డు  రావాలి. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఆయన పేరు కేంద్రానికి సిఫారసు చేయక పోవడంతో అవార్డు రాకుండా పోయింది. ఇలాంటి అన్యాయం జరగకుండా చూడాలి.

- నర్సింగ్​రావు