Jersey Re Release: నాని ఫ్యాన్స్ గెట్ రెడీ..మళ్లీ థియేటర్లలోకి వచ్చేస్తున్న బ్లాక్ బస్టర్ జెర్సీ

Jersey Re Release: నాని ఫ్యాన్స్ గెట్ రెడీ..మళ్లీ థియేటర్లలోకి వచ్చేస్తున్న బ్లాక్ బస్టర్ జెర్సీ

గౌత‌మ్ తిన్ననూరి ద‌ర్శక‌త్వంలో క్రికెట్ బ్యాక్ డ్రాప్‌లో వ‌చ్చిన హీరో నాని(Nani) తీసిన చిత్రం జెర్సీ(Jersey).2019లో రిలీజైన జెర్సీ సినిమా భారీ విజయాన్ని సాధించి,ఇప్పటివరకు అనేక అవార్డులు గెలుచుకుంది.ఒక్కో సాంగ్ చార్ట్ బ్లాస్టర్ అవ్వడంతో ఇప్పటికీ ఈ సినిమాపై హైప్ నెక్స్ట్ లెవల్లో ఉంది. 

అయితే..ప్రపంచం నలుమూలల నుంచి ఎన్నో ప్రశంసలు పొందిన  జెర్సీ మూవీ త్వరలో రీ రిలీజ్ కానుంది. ఇపుడు ‘జెర్సీ’ సినిమా మళ్లీ థియేటర్లలో అడుగుపెట్టనుందని తెలియడంతో ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు. అంతేకాదు..నాని ఫ్యాన్స్ ఈ సినిమాతో జెర్సీ ఫ్యాన్స్ గా మారారు. 

తాజా సమాచారం ప్రకారం..ఏప్రిల్ 19 వ తేదీకి జెర్సీ మూవీ రిలీజై ఐదేళ్లు పూర్తికానుంది.దీంతో ఏప్రిల్ 20న థియేటర్లలో రీ రిలీజ్ కానుంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని థియేటర్లలో పెద్ద ఎత్తున స్పెషల్ షోలు పడనున్నాయి. ఈ మేరకు ఏప్రిల్ 20న జెర్సీ మూవీ రీ-రిలీజ్‍ కాబోతుందంటూ మేకర్స్ అఫీసియల్ అనౌన్స్ మెంట్ ఇస్తూ పోస్టర్ రిలీజ్ చేశారు. 

జెర్సీ 67వ జాతీయ చలనచిత్ర అవార్డులలో ఉత్తమ తెలుగు చిత్రం, ఉత్తమ ఎడిటర్ విభాగాల్లో రెండింటికీ రెండు జాతీయ అవార్డులను గెలుచుకుంది. జెర్సీకి ఎడిటర్‌‌గా వ్యవహరించిన నవీన్ నూలి అవార్డు దక్కించుకున్నారు.ఈ మూవీ విమర్శకుల చేత ప్రశంసలు అందుకున్న చిత్రంగా నిలిచింది. రూ.25 కోట్లతో తెరకెక్కించిన ఈ మూవీకి సుమారు రూ.50 కోట్ల వరకు కలెక్షన్స్ వచ్చాయి.ఇప్పుడు, ఐదేళ్ల తర్వాత ఏప్రిల్ 20న జెర్సీ మళ్లీ థియేటర్లలో రానుండటంతో ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు.