నాన్నగా  నాని.. గ్లింప్స్ రెడీ

నాన్నగా  నాని.. గ్లింప్స్ రెడీ

‘దసరా’ సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకుని, వంద కోట్ల క్లబ్‌‌లో చేరిన నాని.. పాన్ ఇండియా స్థాయిలోనూ గుర్తింపును తెచ్చుకున్నాడు. ఈ మూవీని నెట్‌‌ప్లిక్స్ సంస్ఠ భారీ రేటుకు కొనుగోలు చేసింది. ఏప్రిల్ 27 నుంచి ధరణి ఓటీటీలో హంగామా చేయనున్నాడని ప్రకటిస్తూ.. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఇది స్ట్రీమింగ్ కానుందని తెలియజేశారు. మరోవైపు నాని నెక్స్ట్ సినిమా టైటిల్ గురించి ఓ ఇంటరెస్టింగ్‌‌ న్యూస్ ప్రచారంలో ఉంది.

శౌర్యువ్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ మూవీ తండ్రీకూతురు  మధ్య అనుబంధం నేపథ్యంలో ఉండబోతోందని ఇప్పటికే విడుదలైన వీడియో గ్లింప్స్‌‌లో చూపించారు. దీంతో ఈ సినిమాకి ‘నాన్న’ పేరుతో టైటిల్ వచ్చేలా ప్లాన్ చేస్తున్నారట మేకర్స్. ‘హాయ్ నాన్న’ అనే టైటిల్ పరిశీలనలో ఉందని తెలుస్తోంది. ప్రస్తుతం గోవాలో  షూటింగ్ జరుగుతోంది. నాని  కూతురిగా బేబి కైరా నటిస్తోంది.  మృణాల్ ఠాకూర్‌‌‌‌ హీరోయిన్‌‌. మోహన్‌‌ చెరుకూరి, డాక్టర్ విజేందర్‌‌ రెడ్డి తీగల, మూర్తి కేఎస్‌‌ నిర్మిస్తున్నారు. హెశమ్‌‌ అబ్దుల్‌‌ వహబ్‌‌ సంగీతం అందిస్తున్నాడు.  క్రిస్మస్ కానుకగా  డిసెంబర్ 21న సినిమా విడుదల చేయనున్నట్టు ఇప్పటికే  అనౌన్స్ చేశారు.