Saripodhaa Sanivaaram: ఉగాది స్పెషల్ సరిపోదా శనివారం కొత్త పోస్టర్..పద్దతిగా సరిపోయింది నాని

Saripodhaa Sanivaaram: ఉగాది స్పెషల్ సరిపోదా శనివారం కొత్త పోస్టర్..పద్దతిగా సరిపోయింది నాని

నేచురల్ స్టార్ నాని(Nani) వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. ఇటీవలే హాయ్ నాన్న(Hi Nanna) సినిమాతో డీసెంట్ హిట్ అందుకున్న నాని.. ప్రస్తుతం దర్శకుడు వివేక్ ఆత్రేయ(Vivek Athreya)తో సరిపోదా శనివారం(Saripoda Sanivaram) అనే సినిమా చేస్తున్నాడు. ప్రియాంక మోహనన్(Priyanka Mohanan) హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాను డీవీవీ దానయ్య(DVV Danayya) నిర్మిస్తున్నారు.

తాజాగా ఉగాది సందర్బంగా (ఏప్రిల్ 9న) సరిపోదా శనివారం నుంచి నాని..సాయి కుమార్ పోస్టర్ రిలీజ్ చేశారు. ఎంతో సాంప్రదాయంగా పట్టు పంచతో సాయి కుమార్..పద్దతిగా చేతులు కట్టుకుని నాని..ఉగాది శుభాకాంక్షలు తెలిపిన పోస్టర్ బాగుంది. అయితే, ప్రస్తుతం ఈ పోస్టర్ కు సాయి కుమార్ గ్లింప్స్ లో చెప్పిన డైలాగ్స్ ని జోడించి సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. 

"మన పెద్దలు ఒక మాట అనేవారు..రాజుకైనా, బంటుకైనా, ఎలాంటి వాడికైనా ఓ రోజు వస్తోంది..ఇపుడు కొత్త తరం వాళ్ళు మాత్రం.. నీకంటూ ఒక టైం వస్తుంది అంటారు. కానీ ఏ తరం వాళ్ళైకైనా..కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూసేది..ఆ ఒక్క రోజు గురుంచే. అది ఒకడికి వారానికి ఓ రోజు వస్తే..వాడ్ని ఎవడైనా ఆపగలడా? అదే శనివారం..సరిపోదంటారా..అని చెప్పే సాయి కుమార్ డైలాగ్ ట్రెండ్ అవుతోంది.  

నాని 31 వ సినిమాగా వస్తోన్న ఈ మూవీ టైటిల్ తో పాటు రిలీజ్ చేసిన ఫస్ట్ గ్లింప్స్ అదిరిపోయింది. ఈ పోస్టర్ లో నాని చేతికి సంకెళ్లు..భీకరమైన అరుపుతో ఉన్న ఇంటెన్సిఫైడ్ ఫస్ట్ లుక్ ఆకట్టుకుంటోంది.ఈ పోస్టర్ ను మరింత క్లోజ్గా గమనిస్తే..నాని బంధించబదినట్టుగా లేడు..సంకెళ్లు తెంచుకుని జయించటానికి సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తోంది.దేంతో అర్ధం చేసుకోవొచ్చు సరిపోదా శనివారం ఎలా ఉంటుందో అని.