Hair Grow tips: జుట్టు బాగా పెరగాలని రాత్రిపూట అతిగా నూనె పెడుతున్నారా.. అయితే ఇది మీకోసమే..

Hair Grow tips: జుట్టు బాగా పెరగాలని రాత్రిపూట అతిగా నూనె పెడుతున్నారా.. అయితే ఇది మీకోసమే..

అందం అంటే చర్య సౌందర్యం మాత్రమే కాదు.. శిరోజాల సంరక్షణ కూడా. పొడవైన వెంట్రుకలు అమ్మాయిల అందాన్ని రెట్టింపు చేస్తాయి. అందుకే ప్రతి ఒక్కరూ జుట్టును అందంగా, పొడవుగా పెరిగేలా చూసుకుంటారు. ఒకవేళ జుట్టు రాలుతుంటే.. బాగా ఆందోళనకు గురవుతారు. జుట్టు రాలే సమస్యను నివారించేందుకు.. వివిధ రకాల అశాస్త్రీయమైన ఉత్పత్తులను  ఉపయోగిస్తారు.

అయితే వాటివల్ల జుట్టుకు ఎలాంటి ఉపయోగం ఉండదు.. పైగా సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని నిపుణులు చెబుతుంటారు. అందుకే జుట్టు రాలకుండా, ఒత్తుగా, పొడువుగా పెరగాలంటే మీరు చేస్తున్న  కొన్ని తప్పులు ఆపేయాలి.. అవేంటో చూద్దాం.. 

అతిగా నూనె పెట్టకూడదు..

జుట్టు రాలడానికి మరో కారణం ఏంటంటే.. మీ జుట్టుకు ఎక్కువగా నూనె రాయడం వల్ల కూడా జుట్టు వీక్ గా మారుతుంది. జుట్టుకు నూనె రాసుకోవడం వల్ల జుట్టు దృఢంగా మారుతుందని అందరూ నమ్ముతారు. అయితే కొన్ని సందర్భాల్లో జుట్టు రాలడం కూడా స్టార్ట్ అవుతుంది. జుట్టుకు ఎక్కువగా నూనె రాయడం వల్ల హెయిర్ ఫాలికల్స్ అనేటివి బ్లాక్ అవుతాయి. 

మీకు ఇప్పటికే హెయిర్ ఫాల్ సమస్య ఉంటే.. ఎక్కువగా నూనె రాయొద్దు. అంతే కాదు.. రాత్రిపూట నూనె రాసుకుని నిద్రపోవడం వల్ల జుట్టు టెలోజెన్ దశకు చేరి చాలా నష్టం కలిగిస్తుంది. ఇది వెంట్రుకల ఆరోగ్యాన్ని మంరింత క్షిణింపజేసి జుట్టు రాలడానికి కారణం అవవుతుంది. 

షాంపూలు ఎక్కువగా వాడొద్దు..

జుట్టుకు తరచూ షాంపూ చేయడం వల్ల కూడా జుట్టుకు నష్టం వాటిల్లుతుంది. షాంపూలో మీ స్కల్స్ లోని సహజ నూనెలను తొలగించే అనేక రసాయనాలు ఉంటాయి. అలాగే ఎక్కువగా షాంపూ చేయడం వల్ల జుట్టు రాలిపోతుంది. జుట్టు విషయంలో ఎలాంటి కేర్ తీసుకోవాలనేది చాలా మందికి అవగాహన ఉండదు. చర్మ సౌందర్యానికి తీసుకున్నట్లే జుట్టుకూ చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. డ్రై హెయిర్ ఉన్నవారు కండీషనర్స్ ఎక్కువగా వాడాలి. వీళ్లు వారానికోసారి హెయిర్ వాష్ చేసుకుంటే సరిపోతుంది. హెయిర్ బ్రష్ లేదా దువ్వెన సరిగ్గా వాడటం జుట్టుకు మంచిది. అలాగని ప్రతి గంటకు ఒక్కసారి జుట్టును దువ్వుకోవద్దు. ఇది జుట్టును మరింత దెబ్బతీస్తుంది. 

తలస్నానానికి ఎలాంటి నీళ్లు వాడాలి..

తలస్నానానికి గోరువెచ్చటి నీటిని వినియోగించాలి. అప్పుడే జుట్టు రాలకుండా ఉంటుంది. మీర ఎక్కువ వేడి ఉన్న నీటిని వాడకుదు. అలాగని చల్లని నీరు కూడా స్నానానికి ఉపయోగించకూడదని నిపుణులు చెబుతున్నారు. అలాగే గాఢత తక్కువగా ఉండే షాంపూలు జుట్టుకు మేలు చేస్తాయి. తలస్నానం చేసిన వెంటనే జుట్టును దువ్వకూడదు. అలా చేస్తే వెంట్రుకలు తెగిపోవడంతోపాటు, జుట్టు ఎక్కువ రాలిపోవడం లాంటి సమస్యలు ఎదురవుతాయి. 

ALSO READ : Good Health : పచ్చళ్లు తింటే ఆరోగ్యమా.. ఎలాంటి లాభాలు ఉంటాయి..!

ఆయిలీ హెయిర్..

ఆయిలీ హెయిర్ ఉన్నవారు తరచూ తలస్నానం చేయాలని నిపుణులు చెబుతుంటారు. డ్రై హెయిర్ ఉన్నవారు వేడినీటితో కాకుండా మామూలు నీళ్లతో తలస్నానం చేయాలి. జుట్టు బలంగా, దృఢంగా మారాలంటే దానికి ఐరన్, కాపర్, జింక్, బీ-కాంప్లెక్స్, విటమిన్-డి లాంటి పోషకాలను అందించాలి.

నీళ్లు ఎక్కువగా తాగాలి..

శిరోజాల రక్షణకు ఆరోగ్యకరమైన జీవనశైలి తప్పనిసరి. ఇందులో భాగంగా మంచినీళ్లు ఎక్కువగా తాగాలి. దీని వల్ల శరీరంలో నీటిస్థాయిలు పెరగడమే కాకుండా చర్మంలోని మలినాలు, వ్యర్థాలు బయటకు వెళ్లిపోతాయని నిపుణులు సూచిస్తారు. ఫలితంగా కుదుళ్ల ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఇది జుట్టు ఎదుగుదల, దృఢత్వానికి మేలు చేస్తుంది. విటమిన్ల లోపం జుట్టుపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది.

ఎలాంటి ఆహారం తీసుకోవాలి..

విటమిన్ల లోపం వల్ల జుట్టు ఎక్కువగా రాలిపోతుంది. జుట్టుపై పడే ప్రతికూల ప్రభావాన్ని నిరోధించాలంటే ప్రొటీన్లు, బయోటిన్ ఉండే పదార్థాలను ఎక్కువగా తీసుకోవాలి. ప్రొటీన్లు, బయోటిన్ అధికంగా లభించే గుడ్లు, ఆకుకూరలు, పెరుగు మొదలైన వాటిలో ఉంటాయి. జుట్టు సంరక్షణకు ప్రొటీన్లు చాలా ముఖ్యం. న్యూట్రిషన్ సప్లిమెంటేషన్ చేయడం మూలంగా జుట్టు ఒత్తుగా పెరుగుతుంది. దీని ద్వారా జుట్టు బలంగా, దృఢంగా తయారవుతుంది. సీజనల్ గా కూడా హెయిర్ గ్రోత్లో తేడా వస్తుంది. ఒక్కో సీజన్లో జుట్టు వేగంగా పెరుగుతుంది.. ఒక్కో సీజన్ హెయిర్ గ్రోత్ తక్కువగా ఉంటుంది. 

హెయిర్ డ్రయ్యర్స్ వద్దు..

తలస్నానం తర్వాత జుట్టును సహజంగానే ఆరనివ్వాలి. అలా కాకుండా వేడి ఎక్కువ ఉత్పత్తి చేసే హెయిర్ డ్రయ్యర్స్ వాడితే.. కుదుళ్లలో అలర్జీలు, జుట్టు చివర్ లో చిక్కడం వంటి సమస్యలు మొదలవుతాయి.