నవంబర్ 9న నవరస రామచరితం నృత్య ప్రదర్శన

నవంబర్  9న నవరస రామచరితం నృత్య ప్రదర్శన

ఖైరతాబాద్, వెలుగు: మువ్వ నృత్య రాగ నిగమం 20వ వార్షికోత్సవం సందర్భంగా ఈ నెల 9న మాదాపూర్ శిల్పాకళా వేదికలో 40 మంది స్టూడెంట్లతో ‘ నవరస రామచరితం’ కూచిపూడి ప్రదర్శన నిర్వహిస్తున్నట్లు డాక్టర్ హిమబిందు కనోజ్ తెలిపారు. మంగళవారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్​లో జరిగిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు.

కూచిపూడి ప్రదర్శనకు చీఫ్ గెస్టులుగా మ్యూజిక్ డైరెక్టర్ తమన్, డ్రమ్స్ శివమణి, సినీ నటులు మురళీ మోహన్, భాను చందర్, సుమన్, డైరెక్టర్ అనిల్ రావిపూడి హాజరుకానున్నట్లు ఆమె తెలిపారు.