OTT Thriller: ఓటీటీకి వణుకుపుట్టించే క్రైమ్ థ్రిల్లర్.. అదిరిపోయే ట్విస్టులు, థ్రిల్లింగ్ ఇన్వెస్టిగేటివ్ సీన్స్

OTT Thriller: ఓటీటీకి వణుకుపుట్టించే క్రైమ్ థ్రిల్లర్.. అదిరిపోయే ట్విస్టులు, థ్రిల్లింగ్ ఇన్వెస్టిగేటివ్ సీన్స్

నవీన్ చంద్ర హీరోగా లోకేశ్ అజ్ల్స్ దర్శకత్వంలో రూపొందిన ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ ‘లెవెన్’. 2025 మే 16న తెలుగు, తమిళ భాషల్లో థియేటర్లో విడుదలైంది. రుచిర ఎంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టైన్‌‌‌‌‌‌‌‌మెంట్స్ బ్యానర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై ఎన్ సుధాకర్ రెడ్డి ఈ చిత్రాన్ని తెలుగులో రిలీజ్ చేశారు.

తెలుగు క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ మూవీగా వచ్చిన లెవెన్ మూవీకి మంచి మార్కులు పడ్డాయి. సస్పెన్స్ క్రియేట్ చేస్తూ.. ఊహించని ట్విస్టులు, అదిరిపోయే మలుపులతో సినిమా సాగింది. డైరెక్టర్ లోకేష్ తన గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లేతో థియేటర్ ఆడియన్స్కు మంచి బూస్ట్ ఇచ్చాడు.

సీరియ‌ల్ కిల్ల‌ర్ క‌థ, ఎమోష‌న‌ల్ సీన్స్ ఆకట్టుకుంటాయి. ఫ్రీ ఇంట‌ర్వెల్‌కు ముందే కిల్ల‌ర్ బ‌య‌ట‌ప‌డ్డ, చివ‌ర్లో వ‌చ్చే ట్విస్టు సైతం గూస్‌బ‌మ్స్ తెచ్చేలా ఉంటుంది. థియేటర్లో సినిమా చూడటం మిస్ అయిన ఆడియన్స్.. లెవెన్ ఓటీటీ స్ట్రీమింగ్ కోసం ఎదురుచూస్తున్నారు. 

ఇపుడీ ఈ మూవీ ఓ నాలుగు ఓటీటీల్లోకి స్ట్రీమింగ్కు రానున్నట్లు సమాచారం. టెన్త్కోటతో పాటు, ఆహా తమిళ్, ప్రైమ్ మరియు సింప్లీసౌత్‌లలో అడుగుపెట్టనుంది. జూన్ 13 నుంచి‘లెవెన్’ తెలుగు, తమిళ భాషల్లో స్ట్రీమింగ్కి సిద్ధమైంది. డైరెక్టర్ లోకేశ్ అజ్ల్స్.. తమిళ పాపులర్ డైరెక్టర్ సుందర్ సి వద్ద అసిస్టెంట్ దర్శకుడిగా పనిచేశాడు. ఈ సినిమాతో దర్శకుడిగా మారి.. తన  సత్తాచాటాడు. 

కథేంటంటే:

వైజాగ్ నగరంలో వరుసగా హత్యలు జరుగుతుంటాయి. హత్యలు ఎవరు చేశారనేది పోలీసులకు అంతుచిక్కదు. ఈ హత్య కేసులను పరిశోధించే పోలీస్ ఆఫీసర్ రంజిత్ (శశాంక్) రోడ్డు ప్రమాదానికి గురవుతాడు. స్మార్ట్ పోలీస్‌గా పేరున్న అసిస్టెంట్ కమిషనర్ అరవింద్ (నవీన్ చంద్ర) రంగంలోకి దిగుతారు. ఆపై కూడా వ‌రుస హత్యలు కొనసాగుతూనే ఉన్నా హంతకుడు, హత్యకి గురైనవాళ్ల ఆనవాళ్లు ఆధారాలు ఎంత‌కీ ల‌భించ‌వు.

చివ‌ర‌కు ఆరో హ‌త్య‌ దగ్గర ఓ చిన్న క్లూ దొరుకుతుంది. అక్కడే కేసు ఇన్వెస్టిగేషన్కు ఓ చిన్న కదలిక మొదలవుతుంది. అలా హత్యకు గురైన వాళ్ళ వివరాలు ఒక్కోటిగా బయటకి వస్తాయి. కానీ, చంపిందేవరు అనేది మాత్రం సస్పెన్స్గా మిగిలిపోతుంది.

చివరికి హంతకులను అరవింద్ ఎలా పట్టుకున్నాడు? ట్విన్‌ బర్డ్‌ స్కూల్‌కి, 6 మంది కవలలకి ఈ హత్యలకు సంబంధం ఏంటి? ఈ క్రమంలో అరవింద్ కు తెలిసిన నిజాలు ఏంటీ? ట్విస్టులు ఏంటీ? కథలో బెంజిమన్‌ పాల్‌, ఫ్రాన్సిస్‌ ఎవరు? అనేది మిగతా స్టోరీ!