జైపూర్, వెలుగు: రామగుండం కమిషనరేట్ పరిధిలో కొత్తగా ఏర్పడిన జైపూర్, భీమారం సర్కిల్‌కు సీఐగా నవీన్ కుమార్ సోమవారం బాధ్యతలు తీసుకున్నారు. జైపూర్ సర్కిల్ ఆఫీసులో బాధ్యతలు స్వీకరించిన సీఐకి పోలీసు సిబ్బంది స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. గంజాయి నిర్మూలన, అసాంఘిక కార్యకలాపాలపై ప్రత్యేక దృష్టిసారిస్తామని తెలిపారు. శాంతి భద్రతల విషయంలో రాజీలేకుండా పనిచేస్తామన్నారు.
