నవీన్ పొలిశెట్టి, మీనాక్షి చౌదరి జంటగా నటిస్తున్న చిత్రం ‘అనగనగా ఒకరాజు’. మారి దర్శకుడు. సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్న ఈ చిత్రం సంక్రాంతి సందర్భంగా జనవరి 14న విడుదల కానుంది. మ్యూజికల్ ప్రమోషన్స్ స్టార్ట్ చేసిన మేకర్స్ గురువారం ఫస్ట్ సాంగ్‌ను రిలీజ్ చేశారు. ‘భీమవరం బల్మా’ అంటూ సాగిన ఈ పాటను మిక్కీ జే మేయర్ కంపోజ్ చేయగా, చంద్రబోస్ రాసిన లిరిక్స్, నవీన్ పొలిశెట్టి, నూతన మోహన్ పాడిన విధానం ఆకట్టుకుంది.
‘చాట్ జీపీటీ.. ఎవరే ఈ బ్యూటీ.. ఇంతందంగా ఉందేంటీ హై.. డ్రెస్సులు కోటి.. వెలకడితే కోటి.. యే కిస్కీ బేటీ హై భాయ్.. నిన్ను నన్ను చూసినోళ్లు కల్ట్ పెయిర్ అని పేరెడతారు.. నువ్వు నేను స్టెప్పులేస్తే హుక్ స్టెప్పులుగా మార్చేస్తారు..హే వెంట వస్తా పడి పడి.. చేరనా నీ ఒడి ఒడి ఒడిలో..’ అంటూ ఎనర్జిటిక్‌గా సాగిందీ పాట. కలర్‌ఫుల్ సెట్స్‌లో శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీలో నవీన్, మీనాక్షి చేసిన డ్యాన్స్ మూమెంట్స్ ఆకట్టుకున్నాయి.
