Asia Cup 2025: ఆఫ్ఘనిస్తాన్‌కు బిగ్ షాక్.. ఆసియా కప్ నుంచి స్టార్ ఫాస్ట్ బౌలర్ ఔట్

Asia Cup 2025: ఆఫ్ఘనిస్తాన్‌కు బిగ్ షాక్.. ఆసియా కప్ నుంచి స్టార్ ఫాస్ట్ బౌలర్ ఔట్

తొలిసారి ఆసియా కప్ గెలవాలని ఆరాటపడుతున్న ఆఫ్ఘనిస్తాన్ కు ఊహించని షాక్ తగిలింది. ఆ జట్టు స్టార్ ఫాస్ట్ బౌలర్ నవీన్-ఉల్-హక్  గాయం కారణంగా టోర్నీ మొత్తానికి దూరమయ్యాడు. భుజం గాయంతో ఇబ్బంది పడుతున్న నవీన్.. పూర్తి ఫిట్ నెస్ సాధించకపోవడంతో టోర్నీ నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. ఈ విషయాన్ని ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ బోర్డు సోమవారం (సెప్టెంబర్ 15) అధికారికంగా ప్రకటించింది. కాంటినెంటల్ టోర్నమెంట్ కోసం 17 మంది సభ్యులతో కూడిన ఆఫ్ఘనిస్తాన్ జట్టులో గాయంతో ఉన్నప్పటికీ నవీన్ ఎంపికయ్యాడు.

2024 డిసెంబర్ లో చివరిసారిగా టీ20 మ్యాచ్ ఆడిన ఈ ఆఫ్ఘన్ స్టార్ పేసర్.. ఈ ఏడాది ఒక్క అంతర్జాతీయ మ్యాచ్ కూడా ఆడలేదు. "ఆఫ్ఘనిస్తాన్ వెటరన్ ఫాస్ట్ బౌలర్ నవీన్ ఉల్ హక్ ను టీ20 ఆసియా కప్ 2025 నుండి తొలగించారు. అతను భుజం గాయం నుండి కోలుకుంటున్నాడు. మిగిలిన మ్యాచ్ లలో ఆడడానికి ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ బోర్డు వైద్య బృందం అతన్ని ఫిట్ గా ప్రకటించలేదు". అని ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ బోర్డు 'X' లో తెలిపింది. నవీన్ 'పూర్తిగా ఫిట్ అయ్యే వరకు ఇంటెన్సివ్ ట్రీట్మెంట్.. పునరావాసం' పొందుతాడని బోర్డు తెలిపింది. 

ALSO READ : షేక్ హ్యాండ్ వివాదం: పాకిస్తాన్కు ఎదురుదెబ్బ.. పాక్ డిమాండ్ను కొట్టి పారేసిన ఐసీసీ

నవీన్-ఉల్-హక్  స్థానంలో స్పీడ్‌స్టర్ అబ్దుల్లా అహ్మద్‌జాయ్‌ను ఎంపిక చేసింది. రిజర్వ్ ప్లేయర్ గా జట్టులో ఉన్న అహ్మద్జాయ్‌ను తమ ప్రధాన జట్టులోకి చేర్చుకుంది. అహ్మద్జాయ్ ఆఫ్ఘనిస్తాన్ జట్టు తరపున ఒక టీ20 మాత్రమే ఆడాడు. ఇటీవలే ముగిసిన ట్రై-సిరీస్‌లో యూఏఈపై అరంగేట్రం చేశాడు. మంగళవారం (సెప్టెంబర్ 16) ఆసియా కప్ లో బంగ్లాదేశ్ పై ఆఫ్ఘనిస్తాన్ కీలక మ్యాచ్ ఆడాల్సి ఉంది. ఈ మ్యాచ్ కు ముందు ఇలా జరగడం రషీద్ ఖాన్ సేనకు పెద్ద ఎదురు దెబ్బే అని చెప్పాలి. 

ఆఫ్ఘనిస్తాన్ స్క్వాడ్: 

సెడిఖుల్లా అటల్, రహ్మానుల్లా గుర్బాజ్(వికెట్ కీపర్), ఇబ్రహీం జద్రాన్, మహ్మద్ నబీ, గుల్బాదిన్ నైబ్, అజ్మతుల్లా ఒమర్జాయ్, కరీం జనత్, రషీద్ ఖాన్ (కెప్టెన్), నూర్ అహ్మద్, AM ఘజన్ఫర్, ఫజల్హక్ అబ్దుల్ అబ్దుఖీ, ఫజల్హక్ అబ్దుల్ అబ్దుఖీ, మహ్మద్ ఇషాక్, ముజీబ్ ఉర్ రెహమాన్, దర్విష్ రసూలీ, షరాఫుద్దీన్ అష్రఫ్