హైదరాబాద్, వెలుగు: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో గెలిచిన నవీన్ యాదవ్ బుధవారం అసెంబ్లీలోని స్పీకర్ కార్యాలయంలో ఎమ్మెల్యేగా ప్రమాణస్వీకారం చేశారు. నవీన్‌తో స్పీకర్ గడ్డం ప్రసాద్ ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు శ్రీధర్‌బాబు, అజారుద్దీన్, ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు. అనంతరం నవీన్ యాదవ్ గాంధీ భవన్‌లో మీడియాతో మాట్లాడారు.
తనకు టికెట్ ఇచ్చి గెలిపించిన పార్టీ అగ్ర నేతలు, సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్, మంత్రులు, ఇతర నేతలకు ఆయన కృతజ్ఞతలు చెప్పారు. ఇచ్చిన మాట ప్రకారం జూబ్లీహిల్స్ నియోజకవర్గం అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానని, ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటానని అన్నారు. ఈ నియోజవర్గంలోని ప్రధాన సమస్యలను వెంటనే పరిష్కరించేందుకు కృషి చేస్తానని చెప్పారు.
