ఇయ్యాల జైలు నుంచి సిద్ధూ విడుదల!

ఇయ్యాల జైలు నుంచి సిద్ధూ విడుదల!

చండీగఢ్: కాంగ్రెస్ నేత నవజ్యోత్ సింగ్ సిద్ధూ(59) శనివారం పాటియాలా జైలు నుంచి రిలీజవ్వనున్నారు. ఈ విషయాన్ని ఆయన తరఫు లాయర్ హెచ్‌‌‌‌పీఎస్‌‌‌‌ వర్మ శుక్రవారం వెల్లడించారు. పంజాబ్‌‌‌‌ జైలు నిబంధనల ప్రకారం సత్ప్రవర్తన కలిగిన దోషి క్షమాపణకు అర్హులని చెప్పారు. జైలులో సిద్ధూ సత్ప్రవర్తనతో మెలగడంతో నిర్ణీత సమయానికి ముందే ఆయన విడుదలయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని వివరించారు.

1988లో ఓ వృద్ధుడిపై దాడిచేసి అతడి మరణానికి కారణమైన కేసులో సిద్ధూకు సుప్రీం కోర్టు ఏడాది జైలు శిక్ష విధించింది. ప్రస్తుతం ఆయ‌‌‌‌న పాటియాలా జైలులో శిక్ష అనుభ‌‌‌‌విస్తున్నారు.