చొప్పదండి, వెలుగు: చొప్పదండిలోని జవహర్ నవోదయ విద్యాలయంలో 6వ తరగతిలో ప్రవేశానికి ఈ నెల 13న ఉదయం 11:30 గంటల నుంచి మధ్యాహ్నం 1:30 గంటల వరకు ఎగ్జామ్ నిర్వహిస్తున్నట్లు ఇన్‌చార్జి ప్రిన్సిపాల్ బ్రహ్మానందరెడ్డి తెలిపారు.
ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా 34 పరీక్షా కేంద్రాల్లో మొత్తం 6,892 మంది విద్యార్థులు హాజరవుతున్నారని ఆయన వెల్లడించారు. పరీక్ష రాయబోయే విద్యార్థులు తమ అడ్మిట్ కార్డులను డౌన్‌లోడ్ చేసుకోవాలన్నారు. అడ్మిట్ కార్డులో ఏమైనా తప్పులు వస్తే ఈనెల 6లోపు చొప్పదండిలోని నవోదయ విద్యాలయంలో సరిచేయించుకోవాలని కోరారు.
