నయన్ సారిక మరో క్రేజీ చాన్స్

నయన్ సారిక మరో  క్రేజీ చాన్స్

ఆయ్, క, రీసెంట్‌‌‌‌‌‌‌‌గా ‘రాకాస’ చిత్రాలతో వరుస హిట్స్ అందుకున్న  నయన్ సారిక మరో  క్రేజీ చాన్స్ అందుకుంది.  నారా  రోహిత్‌‌‌‌‌‌‌‌కు జంటగా ఆమె కనిపించనుందని  తెలుస్తోంది. రీసెంట్‌‌‌‌‌‌‌‌గా రోహిత్ తన 23వ సినిమాను అనౌన్స్ చేయగా, ఇందులో హీరోయిన్‌‌‌‌‌‌‌‌గా నయన్‌‌‌‌‌‌‌‌ను సెలెక్ట్ చేశారట. రొమాంటిక్ కామెడీ ఫ్యామిలీ ఎంటర్‌‌‌‌‌‌‌‌టైనర్‌‌‌‌‌‌‌‌గా తెరకెక్కనున్న ఈ చిత్రంలో నయన్ రోల్‌‌‌‌‌‌‌‌కు చాలా ఇంపార్టెన్స్ ఉంటుందని సమాచారం.   

చినిమిల్లి మణికుమార్ దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ చిత్రాన్ని  కరణ్ సి ప్రొడక్షన్స్ బ్యానర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై భరత్ చౌదరి నిర్మిస్తున్నారు.   ‘షౌటింగ్ సూన్’ అనే ట్యాగ్‌‌‌‌‌‌‌‌లైన్‌‌‌‌‌‌‌‌తో ఇచ్చిన  అనౌన్స్‌‌‌‌‌‌‌‌మెంట్ పోస్టర్‌‌‌‌‌‌‌‌ సినిమాపై ఆసక్తిని పెంచింది. ఈ చిత్రానికి ‘సౌండ్ ఇంజినీర్’ అనే టైటిల్ పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది.  ఇతర నటీనటులు, టెక్నీషియన్స్‌‌‌‌‌‌‌‌, రెగ్యులర్ షూటింగ్‌‌‌‌‌‌‌‌కు సంబంధించిన వివరాలను త్వరలోనే  వెల్లడించనున్నారు.