కాంచన 4 మూవీలో కీరోల్ లో నయనతార...!

కాంచన 4 మూవీలో కీరోల్ లో నయనతార...!

సౌత్‌‌‌‌‌‌‌‌ ఇండియన్‌‌‌‌‌‌‌‌ లేడీ సూపర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్టార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా దూసుకెళ్తున్న నయనతార.. బ్యాక్‌‌‌‌‌‌‌‌ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉంది. హిందీలో సల్మాన్‌‌‌‌‌‌‌‌ ఖాన్‌‌‌‌‌‌‌‌తో నటిస్తున్న చిత్రం సహా దాదాపు ఎనిమిది సినిమాల్లో ఆమె నటిస్తోంది. ఇవికాక తాజాగా మరో సినిమాకు ఆమె అంగీకరించినట్టు తెలుస్తోంది. రాఘవ లారెన్స్‌‌‌‌‌‌‌‌ హీరోగా రూపొందుతున్న ‘కాంచన 4’లో ఆమె కీలకపాత్ర పోషించబోతోందట. 

‘కాంచన’ ఫ్రాంచైజీలో ప్లాష్‌‌‌‌‌‌‌‌ బ్యాక్ సీన్స్‌‌‌‌‌‌‌‌కు ఉన్న ఇంపార్టెన్స్‌‌‌‌‌‌‌‌ తెలిసిందే. తాజా చిత్రంలోనూ ఓ హై ఎమోషనల్‌‌‌‌‌‌‌‌ ప్లాస్‌‌‌‌‌‌‌‌ సీన్‌‌‌‌‌‌‌‌ రాసుకున్నాడట లారెన్స్‌‌‌‌‌‌‌‌. సినిమాకు ఎంతో కీలకమైన ఆ ఎపిసోడ్‌‌‌‌‌‌‌‌లో నయనతార లాంటి స్టార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నటిస్తే బాగుంటుందని ఆమెను సంప్రదించినట్టు సమాచారం. 

క్యారెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నచ్చడంతో ఆమె కూడా ఇందుకు ఓకే చెప్పినట్టు కోలీవుడ్‌‌‌‌‌‌‌‌ టాక్. పూజాహెగ్డే హీరోయిన్‌‌‌‌‌‌‌‌గా నటిస్తున్న ఈ చిత్రంలో నోరా ఫతేహి కీలకపాత్ర పోషిస్తోంది.  తాజాగా నయనతార కూడా యాడ్ అవడంతో ‘కాంచన 4’కు మరింత గ్లామర్ పెరిగింది.