హనుమకొండ / నర్సంపేట, వెలుగు : జాతీయ స్థాయి అండర్ - 10 ఛాంపియన్ షిప్ ఆర్చరీ పోటీలకు హనుమకొండకు చెందిన నాయిని అర్జున్‌రెడ్డి ఎంపికయ్యాడు. హనుమకొండ హంటర్రోడ్కు చెందిన నాయిని శృతి వేణుగోపాల్‌రెడ్డి చిన్న కొడుకు అర్జున్ రెడ్డి నగరంలోని హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో 5వ తరగతి చదువుతున్నాడు.
ఇటీవల హైదరాబాద్ లో ఏకలవ్య ఆర్చరీ అకాడమీలో జరిగిన స్టేట్ లెవల్ మినీ ఆర్చరీ ఛాంపియన్షిప్ పోటీల్లో పాల్గొని, అత్యుత్తమ ప్రతిభ కనబర్చడంలో నిర్వాహకులు జాతీయ స్థాయి పోటీలకు ఎంపికయ్యాడు. మార్చి 26 నుంచి ఏప్రిల్ 7 వరకు గుంటూరులో జరిగే జాతీయ స్థాయి పోటీల్లో అర్జున్‌రెడ్డి పాల్గొననున్నట్లు తల్లితండ్రులు, కోచ్ మాలోతు రాజు తెలిపారు.
