సరోగసీ వ్యవహారంలో నయన్, విఘ్నేష్ దంపతులకు క్లీన్ చిట్

సరోగసీ వ్యవహారంలో నయన్, విఘ్నేష్ దంపతులకు క్లీన్ చిట్

సరోగసీ వ్యవహారంలో నయనతార, విఘ్నేష్ శివన్ దంపతులకు తమిళనాడు ప్రభుత్వం ఏర్పాటు చేసిన విచారణ కమిటీ క్లీన్ చిట్ ఇచ్చింది. నయనతార, విఘ్నేష్ శివన్ల సరోగసీ చట్టబద్ధమే అని వెల్లడించింది. 2016లోనే తమ వివాహం జరిగినట్లు నయన్ విఘ్నేష్లు అఫిడవిట్ దాఖలు చేశారని కమిటీ తన నివేదికలో పేర్కొంది. 2021 నవంబర్లో సరోగసీ ఒప్పందం కుదురిందని తెలిపింది. 

తమకు కవలలు పుట్టారని అక్టోబర్ 9న సోషల్ మీడియా ద్వారా నయన్ విఘ్నేష్ దంపతులు తెలిపారు. సరోగసీ పద్ధతిలోనైనా వివాహం జరిగిన నాలుగు నెలల్లోనే ఎలా సాధ్యమంటూ పలువురు ప్రశ్నించారు. దీంతో తమిళనాడు ప్రభుత్వం విచారణ కమిటీని ఏర్పాటు చేసింది. 

పరిచయం.. ప్రేమ.. పెళ్లి

2015లో వచ్చిన ‘నానుం రౌడ్ ధాన్’ సినిమా సెట్స్‌లో తొలిసారిగా నయనతార, విఘ్నేశ్ శివన్ కలుసుకున్నారు. ఆ తర్వాత కొంతకాలానికే ఇద్దరూ ప్రేమలో పడ్డారు. ఏడేళ్ల ప్రేమ తర్వాత ఈ ఏడాది జూన్ 9న పెళ్లి  చేసుకున్నారు.