
తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు నయనతార. కొన్నేళ్లుగా కోలీవుడ్‌ని ఏలుతున్న ఈ సుందరి రీల్ లైఫ్‌లోనే కాదు రియల్ లైఫ్‌లోనూ సంచలనాలకు మారుపేరు. ప్రస్తుతం ఆమె అట్లీ దర్శకత్వంలో షారుఖ్ ఖాన్‌తో ‘జవాన్’ అనే సినిమాలో నటిస్తోంది. డైరెక్టర్ శంకర్ శిష్యుడు నీలేష్ కృష్ణ దర్శకత్వంలో తన 75వ సినిమాను సైతం ఓకే చేసింది. ఇలా కెరీర్‌ను జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటున్న నయన్‌కు ఒకే ఒక్క అసంతృప్తి మిగిలిపోయిందట. తాజాగా ఓ సినీ కార్యక్రమంలో ఈ లేడీ సూపర్ స్టార్ తన మనసులో మాట బయటపెట్టింది.
దర్శకుడు మణిరత్నం మీదుగా అవార్డును అందుకుంటూ తనకు ఆయనతో సినిమా చేయాలనుందని చెప్పింది. ఇదే తన చిరకాల కోరిక అంటూ వెల్లడించింది. అయితే, ఈ దిగ్గజ దర్శకుడి సినిమాల్లో ఇదివరకు అవకాశం వచ్చినప్పటికీ కొన్ని కారణాల వల్ల అవి చేయలేకపోయిందట. ఇక హీరోల విషయానికొస్తే కమల్ హాసన్ మినహా దాదాపు అందరు సూపర్‌స్టార్స్‌తో ఈ బ్యూటీ నటించిన విషయం తెలిసిందే.