ఆర్‌‌‌‌బీఎల్ బ్యాంక్‌‌‌‌లో వాటా కొనేందుకు ఎన్‌‌‌‌బీడీకి అనుమతి

ఆర్‌‌‌‌బీఎల్ బ్యాంక్‌‌‌‌లో వాటా కొనేందుకు ఎన్‌‌‌‌బీడీకి అనుమతి

న్యూఢిల్లీ: ఆర్‌‌‌‌బీఎల్ బ్యాంక్‌‌‌‌లో 74 శాతం వరకు వాటాను కొనుగోలు చేసేందుకు దుబాయ్‌‌‌‌కి చెందిన ఎమిరేట్స్ ఎన్‌‌‌‌బీడీ బ్యాంకుకు ఆర్‌‌‌‌బీఐ అనుమతి ఇచ్చింది. ఈ విషయాన్ని ఆర్‌‌‌‌బీఎల్ బ్యాంక్ గురువారం వెల్లడించింది. దీనివల్ల ఈ బ్యాంకు ఫారిన్‌ బ్యాంకుకు అనుబంధ బ్యాంకుగా మారుతుంది. 

గత ఏడాది అక్టోబర్‌‌‌‌లో యూఏఈకి చెందిన రెండో అతిపెద్ద బ్యాంకు ఎమిరేట్స్ ఎన్‌‌‌‌బీడీ 60 శాతం మెజారిటీ వాటా కోసం రూ.26,853 కోట్లు ఆఫర్ చేసింది. ఆర్‌‌‌‌బీఐ నిబంధనల ప్రకారం ఎన్‌‌‌‌బీడీ కనీసం 51 శాతం వాటాను కలిగి ఉండాలి. ఓటింగ్ హక్కులు మాత్రం 26 శాతానికి పరిమితం అవుతాయి. కేంద్ర ప్రభుత్వం నుంచి అవసరమైన అనుమతులు పొందిన తర్వాత ఈ ప్రక్రియ పూర్తవుతుంది.