నాగచైతన్య కొత్త చిత్రం ప్రారంభం..

నాగచైతన్య కొత్త చిత్రం ప్రారంభం..

నాగచైతన్య కొత్త చిత్రం ప్రారంభం..

యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య వరుస సినిమాలతో దూసుకెళుతున్నాడు. ఇదే జోరులో ఇటీవలే తన కొత్త చిత్రాన్ని ప్రకటించాడు. దీనికి సంబంధించిన అనౌన్స్ మెంట్ కూడా వ‌చ్చేసింది. తమిళ దర్శకుడు వెంకట్ ప్రభు ఈ సినిమాను తెరకెక్కించనున్నారు. నాగ చైతన్య సరసన కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమా తెలుగుతో పాటు త‌మిళంలోనూ విడుద‌ల కానుంది. కాగా, గురువారం హైదరాబాద్ లో ఈ మూవీ ప్రారంభోత్సవం ఘనంగా జరుపుకుంది.

ఈ కార్యక్రమానికి హీరోలు రానా దగ్గుబాటి, శివ కార్తికేయన్, దర్శకుడు బోయపాటి శ్రీను, సంగీత దర్శకులు ఇళయరాజా, యువన్ శంకర్ రాజా తదితరులు హాజరయ్యారు. ఈ మూవీ ప్రారంబోత్సవంలో రానా దగ్గుబాటి కెమెరా స్విచ్ ఆన్ చేయగా.. దర్శకుడు బోయపాటి హీరో హీరోయిన్లపై క్లాప్ ఇచ్చారు. త్వరలో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలవబోతుందని తెలుస్తోంది. ప‌వ‌న్ కుమార్ స‌మ‌ర్పణలో శ్రీనివాసా సిల్వవర్ స్క్రీన్ బ్యాన‌ర్‌పై ఈ మూవీని శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్నారు.