అంతర్జాతీయ డ్రగ్స్ రాకెట్ : రూ.15 కోట్ల కొకైన్ పట్టివేత

అంతర్జాతీయ డ్రగ్స్ రాకెట్ : రూ.15 కోట్ల కొకైన్ పట్టివేత

ముంబైలో అంతర్జాతీయ డ్రగ్స్ రాకెట్ గుట్టు రట్టు చేశారు. డ్రగ్స్ సిండికేట్ ను ఛేదించడంతో రూ.15 కోట్ల విలువైన కొకైన్ స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు విదేశీయులను అరెస్ట్ చేశారు. ఈ కేసుపై అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్నారు.

ముందస్తు సమచారం మేరకు ఓ హోటల్‌పై ముంబై నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్‌సీబీ) అధికారులు దాడులు చేశారు. జాంబియా దేశస్తుడి నుంచి రూ.15 కోట్ల విలువైన రెండు కిలోల కొకైన్‌ను స్వాధీనం చేసుకున్నారు. జాంబియా దేశానికి చెందిన ఎల్‌ఏ గిల్‌మోర్‌ అనే వ్యక్తిని అరెస్టు చేశామని చెప్పారు.

ఎల్ఏ గిల్ మోర్ బ్యాగ్‌లో రెండు కిలోల బరువున్న కొకైన్‌తో కూడిన రెండు ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నట్లు ఎన్‌సీబీ అధికారి తెలిపారు. దీని విలువ రూ.15 కోట్లు ఉంటుందని అంచనా.

గిల్‌మోర్‌ డ్రగ్స్‌ రవాణ కోసం జాంబియాలోని అడిస్ అబాబా నుంచి ఇథియోపియా రాజధాని లుసాకాకు వెళ్లాడు. అనంతరం విమానంలో ముంబయి చేరుకొని ఓ హోటల్‌లో బసచేశాడు. 

గిల్‌మోర్‌ని విచారించగా మరిన్ని కొత్త విషయాలు బయటపడ్డాయి. ముంబైలోని డ్రగ్స్‌ సరఫరా చేసే వారి సమాచారం బయటపడింది. ఇతడిపై మరో హ్యాండిలర్‌ నియంత్రణ ఉందని గుర్తించారు. ఈ క్రమంలో ఢిల్లీలోని ఓ మహిళను గుర్తించారు. గిల్‌మోర్‌ను డ్రగ్స్‌తీసుకొని ఢిల్లీకి రావాలని ఆమె చెప్పింది. వెంటనే అధికారులు ఢిల్లీకి చేరుకొని ఎమ్మార్‌ అగస్టీన అనే మహిళను కూడా అదుపులోకి తీసుకొన్నారు.

ALSO READ :- ఎల్లోరా శిల్పంలా కీర్తి అందం..లేటెస్ట్ ఫొటోస్ వైరల్