ఈ ఏడాది దసరాతో హిట్టందుకున్న కీర్తి సురేశ్(Keerthi Suresh) వరుస ఆఫర్లతో బిజీగా ఉంది. మహానటి వంటి పెర్ఫార్మెన్స్ ఓరియెంటెడ్ సినిమాలే కాదు వెన్నెల వంటి డీగ్లామర్ రోల్స్‌తోనూ మెప్పించగలనని నిరూపించుకుంది.
రీసెంట్గా తమిళ్లోనూ ఉదయనిధి స్టాలిన్‌తో నటించిన ‘మామన్నన్’ సక్సెస్ కీర్తికి మంచి బూస్ట్ ఇచ్చింది. ఇప్పుడు కోలీవుడ్‌లో వరుస పెట్టి నాలుగు సినిమాల్లో ఈ బ్యూటీ నటిస్తోంది. ప్రస్తుతానికి తెలుగులో మాత్రం మరో కొత్త ప్రాజెక్ట్‌ను కీర్తి ప్రకటించలేదు. ఇటీవల దీపావళి సందర్భంగా ఈ నటి పోస్ట్ చేసిన ఫొటోలు కొన్ని నెట్టింట వైరలవుతున్నాయి. లూజ్ హెయిర్లో బంగారు వర్ణం చీర కట్టులో దేవకన్యలో మెరిసిపోయింది. ఫ్యాన్స్‌కు పండగ శుభాకాంక్షలు చెప్తూ ఈ పోస్ట్ చేసింది. ఇక ఈ ఫొటోల్లో మునుపెన్నడూ లేనంత గ్లామరస్‌గా ఈ హీరోయిన్ కనపడుతోంది.
ALSO READ :- అగ్గిపెట్టె దొరకని హరీశ్ ఆగమాగం మాట్లాడుతుండు: సీతక్క
ఈ ఏడాదిలో తెలుగులో నానితో నటించిన 'దసరా' భారీ వసూళ్లను రాబట్టింది. ఆ సినిమాలో డీ గ్లామర్ చేసిన కీర్తి సురేశ్, బారాత్ డాన్స్ బీట్తో మాస్ ఆడియన్స్తో హుషారెత్తించింది.