లోన్‌‌కు ఎన్‌‌సీడీసీ ఆమోదం 

లోన్‌‌కు ఎన్‌‌సీడీసీ ఆమోదం 
  • రూ.4,563.75 కోట్లు ఇచ్చేందుకు రెడీ

హైదరాబాద్‌‌, వెలుగు: రెండో విడత గొర్రెల పంపిణీకి రాష్ట్ర పశుసంవర్ధక శాఖ రెడీ అవుతోంది. జాతీయ సహకార అభివృద్ధి సంస్థ (ఎన్సీడీసీ) రాష్ట్ర ప్రభుత్వానికి రుణం ఇచ్చేందుకు ముందుకు రావడంతో గొర్రెల పంపిణీపై ఆశలు వదులుకున్న లబ్ధిదారులకు ఊరట కలిగింది. రాష్ట్రంలోని గొల్ల, కురుమ సామాజిక వర్గాలకు 3.5 లక్షల గొర్రెల యూనిట్లను అందించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. లబ్ధిదారుల నుంచి 25శాతం వాటా నిధుల సేకరణ షురూ అయింది. ఇప్పటికే పలు జిల్లాల్లో లబ్ధిదారులు తమ వాటా నిధులను చెల్లిస్తున్నారు. రెండో విడత గొర్రెల పంపిణీ కోసం రూ.6,085కోట్ల నిధులు అవసరమవుతాయని అధికారులు అంచనా వేశారు.

ప్రస్తుతం గొర్రెల ధరలు పెరగడంతో యూనిట్‌‌ వ్యయాన్ని 1,75,000కు పెంచారు. లబ్ధిదారుడి వాటా కింద 43,750 (25శాతం) చెల్లించాల్సి ఉంటుంది. ఇలా 3.50లక్షల యూనిట్లకు  రూ.1,521.25 కోట్లు లబ్ధిదారుల నుంచి సేకరిస్తారు. వారి వాటా పోగా మరో రూ.4,563.75 కోట్ల నిధులు అవసరం ఉంటుంది. గొర్రెల పంపిణీకి అవసరమయ్యే రూ.4,563.75 కోట్ల నిధులను లోన్ గా ఇచ్చేందుకు ఎన్‌‌సీడీసీ సిద్ధమైంది. గొర్రెల కొనుగోళ్లు, పంపిణీ విధానంపై మార్గదర్శకాలు రూపొందించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు.