న్యూఢిల్లీ : గ్రౌండెడ్ క్యారియర్ జెట్ ఎయిర్‌వేస్ పరిష్కార ప్రణాళికను దివాలా అప్పీలేట్ ట్రిబ్యునల్ ఎన్సీఎల్ఏటీ సమర్థించింది. దాని యాజమాన్యాన్ని జలాన్ కల్రాక్ కన్సార్టియంకు బదిలీ చేయడానికి ఆమోదించింది.
యాజమాన్య బదిలీని 90 రోజుల్లోగా పూర్తి చేయాలని జెట్ ఎయిర్‌వేస్ మానిటరింగ్ కమిటీని ఎన్సీఎల్ఏటీ బెంచ్ ఆదేశించింది. అంతేకాకుండా, ఫెర్ఫామెన్స్ బ్యాంక్ గ్యారెంటీగా కన్సార్టియం చెల్లించిన రూ.150 కోట్లను సర్దుబాటు చేయాలని జెట్ ఎయిర్‌వేస్ లెండర్లను కూడా ఆదేశించింది. జలాన్ కల్రాక్ కన్సార్టియం (జేకేసీ) బిడ్డింగ్ ద్వారా జెట్‌ను దక్కించుకుంది.
