గో ఫస్ట్​ ఇన్​సాల్వెన్సీ పిటిషన్​కి ఎన్​సీఎల్​టీ ఆమోదం

గో ఫస్ట్​ ఇన్​సాల్వెన్సీ పిటిషన్​కి ఎన్​సీఎల్​టీ ఆమోదం

న్యూఢిల్లీ: గో ఫస్ట్​ వాలంటరీ ఇన్​సాల్వెన్సీ పిటిషన్​ను విచారణకు అనుమతిస్తున్నట్లు నేషనల్​ కంపెనీ లా ట్రిబ్యునల్​ (ఎన్​సీఎల్​టీ) బుధవారం వెల్లడించింది. దీంతో ఇన్​సాల్వెన్సీ రిజల్యూషన్​ ప్రాసెస్​ మొదలవుతుందని పేర్కొంది. ప్రెసిడెంట్​ జస్టిస్​ రామలింగం సుధాకర్​, ఎల్​ ఎన్​ గుప్తాలతో కూడిన ఇద్దరు మెంబర్ల బెంచ్​ ఈ కేసును విచారించింది. అభిలాష్​ లాను ఇంటరిమ్​ రిజల్యూషన్​ ప్రొఫెషనల్(ఐఆర్​పీ)గా ఎన్​సీఎల్​టీ నియమించింది.

కంపెనీకి మారటోరియం ప్రొటెక్షన్​ కల్పించింది. ఇన్​సాల్వెన్సీ ప్రొసీడింగ్స్​లో ఇంటరిమ్​ రిజొల్యూషన్​ ప్రొఫెషనల్​కు సాయం అందించాల్సిందిగా సస్పెండయిన కంపెనీ డైరెక్టర్ల బోర్టును ఎన్​సీఎల్​టీ ఆదేశించింది. ఇన్​సాల్వెన్సీ ప్రాసెస్​ఖర్చుల కోసం రూ. 5 కోట్లను తక్షణమే ఇంటరిమ్​ రిజొల్యూషన్​ ప్రొఫెషనల్​కు సమకూర్చవలసిందిగా కంపెనీకి ఉత్వర్వులు ఇచ్చింది.