మహారాష్ట్ర డిప్యూటీ సీఎంగాఅజిత్ భార్య సునేత్ర..ప్రతిపాదించనున్న ఎన్సీపీ నేతలు

మహారాష్ట్ర డిప్యూటీ సీఎంగాఅజిత్ భార్య సునేత్ర..ప్రతిపాదించనున్న ఎన్సీపీ నేతలు

ముంబై: మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ మరణంతో ఎన్‌సీపీలో వారసత్వ చర్చ ఊపందుకుంది. ఈ క్రమంలో అజిత్ పవార్ భార్య సునేత్రా పవార్‌ను డిప్యూటీ సీఎంగా ప్రతిపాదించాలని పార్టీ సీనియర్ నేతలు యోచిస్తున్నారు. ఎన్‌సీపీ సీనియర్ నేత, మంత్రి నరహరి జిర్వాల్ మాట్లాడుతూ.. సునేత్రా పవార్‌ను కేబినెట్‌లోకి తీసుకురావాలని ప్రజలు కోరుకుంటున్నారని వెల్లడించారు. 

అదే అజిత్ దాదాకు నిజమైన నివాళి అని పేర్కొన్నారు.  ప్రస్తుతం సునేత్రా పవార్ రాజ్యసభ ఎంపీగా ఉన్నారు. బారామతి అసెంబ్లీ స్థానం నుంచి ఆమె పోటీ చేసే అవకాశం ఉందని పార్టీ వర్గాలు తెలిపాయి. అదే జరిగితే, ఆమెను డిప్యూటీ సీఎంగా నియమించడానికి మార్గం సుగమం అవుతుంది. పవార్ అంత్యక్రియల తర్వాత ప్రఫుల్ పటేల్, ఛగన్ భుజ్ బల్, ధనంజయ ముండే వంటి నేతలు సునేత్రాతో భేటీ అయి, పార్టీ అధ్యక్షురాలిగా లేదా డిప్యూటీ సీఎంగా ఆమె పేరును ప్రతిపాదించినట్లు సమాచారం.