2020లో పెరిగిన సైబర్ క్రైం కేసులు

2020లో పెరిగిన సైబర్ క్రైం కేసులు

న్యూఢిల్లీ : దేశంలో గతేడాది సైబర్ నేరాల సంఖ్య పెరిగింది. 2020లో సైబర్ క్రైమ్ 11 శాతం పెరిగినట్లు నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో ప్రకటించింది. సైబర్ నేరాలకు సంబంధించిన కొత్త డేటాను ఎన్సీఆర్బీ హోమ్ ప్యానెల్ కు అందజేసింది. నివేదిక ప్రకారం 2020లో 50,035 సైబర్ నేరాలు నమోదుకాగా.. 2019లో ఆ సంఖ్య 44,735గా ఉంది. 2018లో 27,248, 2017లో 21,796 సైబర్ కేసులు నమోదయ్యాయి. 2019తో పోలిస్తే 2020లో క్రైమ్ రేటు 11శాతం పెరిగినట్లు స్ఫష్టమవుతోంది. ఎంపీ ఆనంద్ శర్మ నేతృత్వంలోని స్టాండింగ్ కమిటీ ఈ మేరకు రిపోర్టు తయారుచేసింది.

సైబర్ నేరగాళ్లు కొత్త కొత్త పద్దతుల్లో సైబర్ దాడులు జరుపుతుండటంపై హోమ్ కమిటీ ఆందోళన వ్యక్తంచేసింది. పంజాబ్, రాజస్థాన్, గోవాల్లో అసలు సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లు లేవని స్పష్టం చేసింది. ఏపీ, కర్నాటక, యూపీల్లో కేవలం ఒకటి లేదా రెండు స్టేషన్లు మాత్రమే ఉన్నట్లు రిపోర్టు వెల్లడించింది. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా అన్ని జిల్లాల్లోనూ సైబర్ సెల్స్ ఏర్పాటు చేయాలని కేంద్ర హోంశాఖకు ఆదేశాలివ్వనున్నట్లు హోమ్ కమిటీ ప్రకటించింది. రాష్ట్రాలు సైబర్ క్రైమ్ హాట్ స్పాట్లను గుర్తిస్తే సైబర్ నేరాలను అదుపుచేయవచ్చని రిపోర్ట్ అభిప్రాయపడింది.

For more news..

జనగామలో సీఎం టూర్ షెడ్యూల్

సిరిసిల్లలో మహిళల ఆందోళన