టైమ్స్ నౌ సర్వే: మళ్లీ ఎన్డీయేదే పవర్!

టైమ్స్ నౌ సర్వే: మళ్లీ ఎన్డీయేదే పవర్!

కేంద్రంలో మళ్లీ ఎన్డీయేనే అధికారంలోకి రానున్నట్లు టైమ్స్ నౌ–వీఎంఆర్ సంస్థల ప్రీ పోల్ సర్వేలో వెల్లడైంది. గతంలో కంటే సీట్లు తగ్గినా పవర్ లోకి వచ్చేది ఆ కూటమేనని తేలింది. దేశవ్యాప్తంగా 960ప్రాంతాల్లో మార్చి 22 నుంచి ఏప్రిల్​ 4 మధ్య సర్వేనిర్వహించారు. 14,301 మంది అభిప్రాయాలు తీసుకున్నారు. సర్వే ఫలితాలను సోమవారం ప్రకటించారు. 543 ఎంపీ సీట్లలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే279 సీట్లు సాధిస్తుందని, కాంగ్రెస్​ నేతృత్వం లోనియూపీఏ 149 సీట్లు రాబట్టుకుంటుందని తేలింది.ఇతరులు 115 చోట్ల విజయం సాధించనున్నారు.

57 సీట్లు తగ్గుదల
2014 ఎన్నికల్లో ఎన్డీయే 336 సీట్లు కైవసంచేసుకోగా.. ఈ సారి 57 సీట్లను కోల్పోయే అవకాశంఉంది. అదే ఎన్నికల్లో యూపీఏ 60 సీట్లు మాత్రమే గెలుచుకోగా.. ఈ సారి అదనంగా 89 సీట్లు రాబట్టుకునే చాన్స్​ ఉంది. ఎన్డీయే నుంచి కొన్ని పార్టీలు దూరమవడం, యూపీఏలో కొన్ని పార్టీలు చేరడం వల్ల రెండు కూటముల సీట్ల హెచ్చుతగ్గులపై ప్రభావం చూపనున్నాయని సర్వే సంస్థలు అభిప్రాయపడ్డాయి .

యూపీలో బీజేపీకి కూటమి గండి
ఉత్తరప్రదేశ్ లో 80 సీట్లలో గత ఎన్నికల్లో బీజేపీ 73సీట్లు సాధించగా.. ఈ సారి 50 సీట్లకు పరిమితమవుతుందని సర్వే అంచనా వేసింది. కూటమి 27 స్థానాల్లో విజయం సాధిస్తుందని తేలింది. కాంగ్రెస్​ 3 సీట్లురాబట్టుకునే అవకాశం ఉంది. గుజరాత్ లో గత ఎన్నికల్లో బీజేపీ 26కు 26 సీట్లు వచ్చాయి. ఈ సారి 22, కాంగ్రెస్​కు 4 సీట్లు రానున్నాయి . రాజస్థాన్​లో గతఎన్నికల్లో 25కు 25 సీట్లు బీజేపీ వచ్చాయి .ఈ సారి18 సీట్లు, కాంగ్రెస్​కు 7 సీట్లు వచ్చే అవకాశం ఉంది.

ఏపీలో వైఎస్సార్​సీపీ జోరు
ఏపీలో లోక్ సభ ఎన్నికల్లో అధికార టీడీపీకి షాక్ తగిలే అవకాశం ఉంది. 25 స్థానాల్లో టీడీపీ 5 సీట్లలో, ప్రతిపక్ష వైసీపీ 20 చోట్ల గెలుస్తుందని తేలింది. 2014 ఎన్నికల్లో టీడీపీ 15, వైఎస్సార్ సీపీ 8, బీజేపీ 2 సీట్లుగెలుచుకున్నాయి . బీజేపీ, కాంగ్రెస్​, జనసేనకు ఒక్కఎంపీ సీటు కూడా దక్కే అవకాశం లేదని వెల్లడైంది.

రాష్ట్రం లో కారు: 14, కాం గ్రెస్:2
17 లోక్ సభ స్థానాలున్న తెలంగాణలో అధికార టీఆర్ఎస్​ 14 స్థానాల్లో విజయం సాధిస్తుందని సర్వే తేల్చింది. కాంగ్రెస్​ పార్టీ రెండు చోట్ల,ఎంఐఎం ఒక చోట విజయం సాధిస్తాయని పేర్కొంది. 2014 ఎన్నికల్లో ఒక స్థానంలో విజయం సాధించిన బీజేపీ.. ఈ సారి ఖాతా తెరిచే పరిస్థితి లేదని అభిప్రాయపడింది. ఓట్లశాతం విషయానికి వస్తే.. టీఆర్ ఎస్​కు 43.6,కాంగ్రెస్​కు 32.5, బీజేపీకి 14.3, ఇతరులకు9.6 శాతం ఓట్లు రావొచ్చని సర్వేలో వెల్లడైంది.