సిగ్గుపడాలి.. చేయని సాయం చేసినట్లు చెప్తుర్రు

సిగ్గుపడాలి.. చేయని సాయం చేసినట్లు చెప్తుర్రు

కరోనా నియంత్రణకు కేంద్రం ఇచ్చిన నిధులపై తెలంగాణ బీజేపీ ఎంపీలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మంత్రి కేటీఆర్ అన్నారు. కేంద్ర ప్రభుత్వం కరోనా నియంత్రణకు రాష్ట్రానికి రూ. 290 కోట్లిస్తే.. రూ.7 వేల కోట్లిచ్చారని బీజేపీ ఎంపీలు చెప్పడం సిగ్గు చేటన్నారు. బీజేపీ ఎంపీలు అసత్యాలు ప్రచారం చేస్తూ ప్రజలను తప్పదోవ పట్టిస్తున్నారన్నారు.

కేటీఆర్ వ్యాఖ్యలను  బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్  కొట్టిపారేశారు. కరోనా సంక్షోభం నుంచి ఎదుర్కొనేందుకు  కేంద్ర ప్రభుత్వం  రాష్ట్రానికి  ఇచ్చిన రూ. 7 వేల కోట్ల కేటాయింపులను  వివరించారు. కేంద్ర నిధులను  ఏం చేశారో ప్రభుత్వం లెక్క చెప్పాలన్నారు.

కరోనాపై పోరులో తెలంగాణకు కేంద్ర సాయం

రైతులకు                                           రూ. 696 కోట్లు

మహిళల జన్ ధన్ ఖాతాల్లో                    రూ. 789 కోట్లు

ఉజ్వల లబ్ధిదారులకు                            రూ. 180 కోట్లు

భవన నిర్మాణ కార్మికులకు                     రూ.126.9కోట్లు

ఈపీఎఫ్ విత్ డ్రాయల్ కు                        రూ. 174 కోట్లు

స్టేట్ డిజాస్టర్ ఫండ్ కు                            రూ. 599 కోట్లు

15వ ఆర్థిక సంఘం నిధులు                    రూ. 982 కోట్లు

వృద్ధాప్య,వితంతు,దివ్యాంగ పెన్షనర్లకు        రూ.68.1 కోట్లు

మన్ రేగాకు అదనంగా ఇస్తున్నది             రూ.1004.09 కోట్లు

ఉచిత బియ్యానికి                                  రూ. 1261.41 కోట్లు

ఉచిత కందిపప్పుకు                              రూ. 262.60 కోట్లు

ఉద్యోగులకు చెల్లిస్తున్న పీఎఫ్                  రూ. 7.68 కోట్లు

డిస్ట్రిక్ మినరల్ ఫండ్ కు                         రూ.1001 కోట్లు