ఎన్డీయే పక్ష నేతగా మోదీ ఏకగ్రీవం..

ఎన్డీయే పక్ష నేతగా మోదీ ఏకగ్రీవం..

ఎన్డీఏ పార్టీల సమావేశం ప్రధాని నివాసంలో ముగిసింది. దాదాపుగంటపాటు కొనసాగిన ఈ భేటీలో ప్రభుత్వ ఏర్పాట్లపై చర్చించారు. ఎన్డీయే భాగస్వామ్య నేతలు మోదీని మరోసారి ఎన్డీయేపక్ష నేతగా ఏకగ్రీవంగా  ఎన్నుకున్నారు.  మోదీకి మద్దతుగా ఎన్డీయే నేతలు 21 మంది సంతకాలు చేశారు. మరి కాసేపట్లో రాష్ట్రపతిని కలవనున్నారు.. ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని కోరనున్నారు. మోదీ జూన్ 9 న  ప్రమాణస్వీకారం చేస్తారని తెలుస్తోంది.

కీలక పదవులపై ఆశలు

అయితే కూటమిలో కీలకంగా మారిన జేడీయూ, టీడీపీ ప్రభుత్వంలో కీలక పదవులు కోరినట్లు తెలుస్తోంది. 12 సీట్లతో కూమిలో కీలకంగా ఉన్న నితీశ్.. కేంద్రంలో మూడు కేబినెట్ పదవులు కోరినట్లు సమాచారం ఉంది. 

దీనితో పాటు బీహార్ కు స్పెషల్ స్టేటస్ ఇవ్వాలని డిమాండ్ పెట్టినట్లు తెలుస్తోంది. మరో భాగస్వామ్య పార్టీ అయిన టీడీపీ కూడా కేంద్ర సర్కార్ లో కీలక పదవులు ఆశిస్తోంది. లోక్ సభ స్పీకర్ తో పాటు.. మూడు కేబినెట్ పదవులు, రెండు స్వతంత్ర మంత్రి పదవులు కోరినట్లు తెలుస్తోంది. చిరాగ్ పాశ్వాన్ లోక్ జన్ శక్తి పార్టీకి ఐదు సీట్లు ఉన్నాయి. ఈ పార్టీ కూడా కేబినెట్ లో భాగస్వామ్యం కోరుతుంది. షిండే నేతృత్వంలోని శివసేన పార్టీ కూడా మంత్రి పదవులు ఆశిస్తున్నట్లు తెలుస్తోంది.