నాగాలాండ్ ముఖ్యమంత్రిగా నీఫియు రియో ప్రమాణ స్వీకారం

 నాగాలాండ్ ముఖ్యమంత్రిగా నీఫియు రియో  ప్రమాణ స్వీకారం

నాగాలాండ్ ముఖ్యమంత్రిగా నేషనలిస్ట్ డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ పార్టీ (ఎన్‌డిపిపి) నాయకుడు నీఫియు రియో వరుసగా​​ ఐదోసారి ప్రమాణ స్వీకారం చేశారు. ఉప ముఖ్యమంత్రులుగా తాడితుయ్ రంగ్‌కౌ జెలియాంగ్, యంతుంగో పాటన్ కూడా ప్రమాణ స్వీకారం చేశారు. కొహిమాలో జరిగిన ఈ  ప్రమాణస్వీకారోత్సవ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా , నాగాలాండ్ గవర్నర్ లా గణేశన్, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా , అస్సాం సీఎం హిమంత బిస్వా శర్మ హాజరయ్యారు.  60 మంది సభ్యులున్న నాగాలాండ్ అసెంబ్లీలో బీజేపీతో కలిసి పోటీ చేసిన నేషనలిస్ట్ డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ పార్టీ  37స్థానాల్లో విజయం సాధించి అధికారాన్ని నిలబెట్టుకుంది.