
చెన్నై: తమిళనాడును వర్షాలు ముంచెత్తుతున్నాయి. కొద్దిరోజులుగా కురుస్తున్న భారీ వానలకు ఊర్లు, సిటీలు ఎక్కడికక్కడ నీట మునిగాయి. చెన్నై, చుట్టుపక్కల ప్రాంతాలు అతలాకుతలమయ్యాయి. శుక్రవారం చెంగల్ పట్టులోని పెరుంబక్కమ్ ప్రాంతంలో వరదలో చిక్కుకున్న ఓ బాలింతను ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది రెస్క్యూ చేశారు. వానకు చంటి బిడ్డ తడవకుండా ఇలా కవర్అడ్డుపెట్టి సురక్షిత ప్రాంతానికి తరలించారు.