హాస్పిటల్‌‌లో ఆక్సిజన్ లీక్.. 22 మంది పేషెంట్లు మృతి

V6 Velugu Posted on Apr 21, 2021

నాసిక్: ఆక్సిజన్ ట్యాంకర్ లీక్ కావడంతో 22 మంది పేషెంట్లు మృతి చెందిన ఘటన మహారాష్ట్రలోని నాసిక్‌‌లో బుధవారం చోటుచేసుకుంది. నాసిక్‌లోని డాక్టర్ జాకీర్ హుస్సేన్ ఆస్పత్రిలో ఆక్సిజన్ ట్యాంకర్ నుంచి సిలిండర్లు నింపుతున్న సమయంలో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 22 మంది రోగులు చనిపోయారని జిల్లా కలెక్టర్ తెలిపారు. ఈ ఘటన గురించి మహారాష్ట్ర మంత్రి డాక్టర్ రాజేంద్ర షింఘానే స్పందించారు. ‘ఇది దురదృష్టకరమైన ఘటన. దీనిపై పూర్తి రిపోర్టును తెలుసుకునే పనిలో ఉన్నాం. ఈ ఘటనపై విచారణకు ఆదేశించాం. దీనికి బాధ్యులైన వారిని విడిచిపెట్టం’ అని షింఘానే స్పష్టం  చేశారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.  

Tagged Maharashtra, Nashik, FDA Minister Dr Rajendra Shingane, oxygen tanker leak

Latest Videos

Subscribe Now

More News