పార్లమెంట్ ఎన్నికలకు సహకరించాలి : రాహుల్ శర్మ

పార్లమెంట్ ఎన్నికలకు సహకరించాలి :  రాహుల్ శర్మ

వికారాబాద్, వెలుగు : జిల్లాలో పార్లమెంటు ఎన్నికలు సజావుగా, ప్రశాంతంగా జరిగేలా రాజకీయ పార్టీల ప్రజా ప్రతినిధులు, నేతలు  సహకరించాలని వికారాబాద్ అడిషనల్ కలెక్టర్ రాహుల్ శర్మ కోరారు. కలెక్టరేట లోని  తన చాంబర్లో ఎన్నికల నియామవళి అమలు,  విధి విధానాలపై వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఆదివారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  రాజకీయ పార్టీలు ఎన్నికల ప్రవర్తనా నియమావళిని అనుసరించాలని, ఉల్లంఘన  పాల్పడకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటామన్నారు. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు, అనుమతులు లేకుండా ఫ్లెక్సీలు, బ్యానర్లు ఏర్పాటు చేసి ఎన్నికల రూల్స్ బ్రేక్ చేయొద్దని సూచించారు. పోలింగ్ కేంద్రాల్లో అన్ని సౌకర్యాలను కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఈ సమావేశంలో వికారాబాద్ డిప్యూటీ తహసీల్దార్ రాజేందర్, బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్,  సీపీఎం ప్రతినిధులతో పాటు రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.