- మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ ఇన్చార్జి నీలం మధు
అమీన్పూర్, పటాన్చెరు, వెలుగు: ఎన్నికల్లో గెలుపోటములు సహజమని, ఓటమి ఎదురైనా కుంగిపోకుండా ప్రజల పక్షాన పని చేయాలని మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ ఇన్చార్జి నీలం మధు సూచించారు. గుమ్మడిదల మండలం మంబాపూర్ పంచాయతీ ఎన్నికల్లో స్వల్ప తేడాతో ఓడిన నర్సింలు, గెలుపొందిన ఉపసర్పంచ్, ఏడుగురు వార్డు సభ్యులను శనివారం నీలం మధు కలిశారు.
ఓటమికి కుంగిపోకుండా నిరంతరం ప్రజల్లో ఉండాలని సూచించారు. కాంగ్రెస్ సంక్షేమ పథకాలను ప్రజలకు అందజేస్తూ సత్సంబంధాలు కొనసాగించాలన్నారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ ప్రవీణ అశోక్‌చారి, వార్డు సభ్యులు రవి, కృష్ణ, భాస్కర్, విజయ్, యాదమ్మ, రాజుగౌడ్, లీలావతి, నర్సింలు, రాజు, తిరుపతి, మల్లేశ్, హనుమంత్ పాల్గొన్నారు.
కార్యకర్తలకు అండగా ఉంటా
గుమ్మడిదల మండలం నల్లవల్లిలో పలువురు కాంగ్రెస్ కార్యకర్తలను నీలం మధు పరామర్శించారు. గ్యాస్ సిలిండర్ పేలి ఇల్లు కాలిపోయిన కుమ్మరి ప్రశాంత్, అనారోగ్యంతో చికిత్స పొందుతున్న మంగళి విష్ణు, గాండ్ల జగదీశ్, బొడ్డు వికాస్ఇండ్లకు వెళ్లి వారిని పరామర్శించారు. ప్రశాంత్ కుటుంబ సభ్యులకు రూ. 50 వేల ఆర్థిక సాయం చేశారు.
అనంతరం మాట్లాడుతూ పార్టీని నమ్ముకున్న కార్యకర్తలకు అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. ఆయన వెంట కాంగ్రెస్ మండల అధ్యక్షుడు నర్సింగ్‌రావు, వీరభద్రస్వామి ఆలయ చైర్మన్ ప్రతాప్‌రెడ్డి, అన్నారనం మాజీ సర్పంచ్ జైశంకర్గౌడ్, మాజీ వైస్‌ఎంపీపీ వీరారెడ్డి, నాయకులు మహేందర్‌రెడ్డి, అశోక్, మహేశ్, మల్లేశ్, వీరేశ్, శ్రీనివాస్, వెంకటేశ్, నాగరాజు, మురళీగౌడ్, శివ, నవీన్, కిరణ్ ఉన్నారు.
