- ఈనెల 31 వరకు అవకాశం
హైదరాబాద్, వెలుగు: నీరా కేఫ్ లీజ్ ను కల్లుగీత సొసైటీలకు ఇచ్చేందుకు టాడీ టాపర్స్ కో-ఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ సంస్థ పిలిచిన టెండర్ గడువును పొడిగించినట్లు టీజీటీటీఎఫ్‌సీ ఎండీ ఉదయ్ ప్రకాశ్ పేర్కొన్నారు. గతంలో ఈనెల 25 వరకు విధించిన గడువును మార్చి 31 వరకు పొడిగించినట్టు తెలిపారు. హైదరాబాద్ నెక్లెస్ రోడ్ లో టాడీ కార్పొరేషన్ ఆధ్వర్యంలో రన్ అవుతున్న నీరా కేఫ్ తోపాటు మరో 7 షాపులు, బాంకెట్ హాల్ ను కల్లుగీత సొసైటీలకు అప్పగించాలని ప్రభుత్వం నిర్ణయించిందని పేర్కొన్నారు.
ఇందులో భాగంగా ఈనెల 18న టెండర్ పిలవగా తొలుత 25 వరకు గడువు ఇచ్చారని. ఇప్పటికే 5 సొసైటీలు టెండర్ దాఖలు చేయగా, ఇంకా ఎక్కువ సొసైటీలు పాల్గొనేందుకు గడువు పొడిగించామని వివరించారు. కాగా, ఈనెల 31న మసాబ్ ట్యాంక్ సంక్షేమ భవన్ లోని కార్పొరేషన్ ఆఫీస్ లో టెక్నికల్, ఫైనాన్సియల్ బిడ్ ఓపెన్ చేస్తామని ఎండీ తెలిపారు.
