దోహా డైమండ్‌‌‌‌ లీగ్‌‌‌‌ కు స్టార్‌‌‌‌ జావెలిన్‌‌‌‌ త్రోయర్‌‌‌‌ నీరజ్‌‌‌‌ చోప్రా దూరం!

దోహా డైమండ్‌‌‌‌ లీగ్‌‌‌‌ కు స్టార్‌‌‌‌ జావెలిన్‌‌‌‌ త్రోయర్‌‌‌‌ నీరజ్‌‌‌‌ చోప్రా దూరం!

న్యూఢిల్లీ: ఇండియా స్టార్‌‌‌‌ జావెలిన్‌‌‌‌ త్రోయర్‌‌‌‌ నీరజ్‌‌‌‌ చోప్రా.. ప్రతిష్టాత్మక దోహా డైమండ్‌‌‌‌ లీగ్‌‌‌‌కు దూరం కానున్నాడు. గత కొంత కాలంగా వెన్ను నొప్పితో బాధపడుతున్న నీరజ్‌‌‌‌.. ప్రస్తుతం స్విట్జర్లాండ్‌‌‌‌లో కోలుకుంటున్నాడు. కామన్వెల్త్‌‌‌‌, ఆసియా క్రీడలను దృష్టిలో ఉంచుకుని నీరజ్‌‌‌‌ అక్కడే 47 రోజుల శిక్షణా శిబిరంలో పాల్గొంటున్నాడు. తన ఫిజియో ఇషాన్‌‌‌‌ మర్వాహా, కోచ్‌‌‌‌ జౌ చౌదరి పర్యవేక్షణలో పూర్తి ఫిట్‌‌‌‌నెస్‌‌‌‌ సాధించేందుకు శ్రమిస్తున్నాడు. 

గత ఏడాది దోహా డైమండ్‌‌‌‌ లీగ్‌‌‌‌లోనే నీరజ్‌‌‌‌ తొలిసారి 90 మీటర్ల మార్క్‌‌‌‌ (90.23 మీటర్లు)ను దాటి జాతీయ రికార్డు సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ నెల 19న జరిగే డైమండ్‌‌‌‌ లీగ్‌‌‌‌లో అర్షద్‌‌‌‌ నదీమ్‌‌‌‌ (పాకిస్తాన్‌‌‌‌), కెషోర్న్‌‌‌‌ వాల్కాట్‌‌‌‌ (ట్రినిడాడ్‌‌‌‌ అండ్‌‌‌‌ టొబాగో), అండర్సన్‌‌‌‌ పీటర్స్‌‌‌‌ (గ్రెనెడా), జూలియన్‌‌‌‌ యోగో (కెన్యా), జాకుబ్‌‌‌‌ వాడ్లెచ్‌‌‌‌ (చెక్‌‌‌‌) బరిలోకి దిగుతున్నారు.