నీట్​ టాపర్స్​ సక్సెస్ స్టోరీ

నీట్​ టాపర్స్​ సక్సెస్ స్టోరీ

ఇండియా టాప్​ ఇన్​స్టిట్యూట్​లో మెడిసిన్​ చేయాలనే లక్ష్యంతో  రెండేళ్లు కష్టపడ్డ ఆ స్టూడెంట్స్​.. జాతీయ స్థాయిలో మొదటి మూడు ర్యాంకులు సాధించారు.  కొవిడ్​తో తలెత్తిన అడ్డంకులకు ఎక్కడా పట్టు సడలనివ్వని వారు.. లాక్​డౌన్​ టైంను సబ్జెక్ట్​ రివిజన్​కు ఉపయోగించుకొని పోటీలో ముందు ఉండగలిగారు. టాప్​లో నిలిచేందుకు​ రెండేళ్ల అక్షర యజ్ఞం సాగించిన తీరు వారి మాటల్లోనే..

రెండున్నరేళ్లు ఇంటికి పోలె-షోయబ్ అఫ్తాబ్ (ఆలిండియా టాప్ ర్యాంక్-1)

కొవిడ్​–19 పాండమిక్​తో నీట్​ ఎగ్జామ్​ వాయిదా పడిన సందర్భంలో కొంత ప్రెజర్​ ఫీలయ్యా. నాన్న నన్ను కలువడానికి కోటాకు వచ్చినప్పుడల్లా పండగలకు ఇంటికి రమ్మనేవారు. ఫెస్టివెల్స్​ ఇతర కార్యక్రమాలకు వెళితే ప్రిపరేషన్​ పక్కదారి పట్టి డిస్టర్బ్​ అవుతుందన్న ఉద్దేశంతో ఎక్కడికీ వెళ్లలేదు. లాక్​డౌన్​ సందర్భంలో స్టూడెంట్స్​ అంతా ఎవరి సొంతూళ్లకు వాళ్లు వెళ్లారు. నేను ఆ టైంను కీలకంగా భావించి చాప్టర్స్​ అన్నీ రివైజ్​ చేశా. ఆన్​లైన్​ క్లాసెస్​ రెగ్యులర్​గా వింటూ డౌట్స్​ ఉంటే ​నెట్​లో వెతకడంతోపాటు ఫోన్​లో ఫ్యాకల్టీతో మాట్లాడాను. టాప్​​ ర్యాంక్​ రావడంలో లాక్​డౌన్​ ప్రిపరేషన్​ నాకు బాగా ఉపయోగపడింది. 2018లో కోటా సిటీకి వచ్చినప్పటి నుంచి దాదాపు రెండున్నరేళ్ల పాటు ఇంటికి పోలేదు. నీట్​లో టాప్​ 50 లోపు ర్యాంకు​ వస్తుందనుకున్న. 720 మార్కులతో ఆలిండియా ఫస్ట్​ ర్యాంక్​ రావడం గొప్ప అచీవ్​మెంట్​గా ఫీల్​ అవుతున్న.

హార్డ్​ వర్క్​నే నమ్ముతా..

విపరీతమైన కాంపిటీషన్​ ఉన్న నీట్ లాంటి నేషనల్​​ ఎగ్జామ్​లో టాప్​ ర్యాంక్​ సాధించాలంటే స్మార్ట్​ వర్క్​ కంటే హార్డ్​ వర్కే ఇంపార్టెంట్​ అనేది నా నమ్మకం. షెడ్యూల్​ ప్రకారం మూడు సబ్జెక్టులకు దాదాపు ఈక్వల్​ టైం కేటాయించి ప్రిపరేషన్​ మొదలు సాగించా. స్ట్రాంగ్​ ఏరియాస్​పై కొంత తక్కువ ఫోకస్​ పెట్టి వీక్​ చాప్టర్స్​పై కాన్సన్​ట్రేట్​ చేశా. ఎగ్జామ్​లో ఎలాంటి ప్రశ్న వచ్చినా ఆన్సర్​ చేసేలా… కాన్సెప్ట్​లను సరిగా అవగాహన చేసుకుంటూ వాటిపై క్వశ్చన్స్​ బాగా ప్రాక్టీస్​ చేశా.  బయాలజీ క్వశ్చన్స్​ చేయడానికి ఎక్కువ టైం పట్టేది. ఆ సమస్యను అధిగమించేందుకు వీక్లీ టెస్ట్​లు, మాడ్యుల్స్​ బాగా సాధన చేశా. ప్రిపరేషన్​లో థియరీ పార్ట్​ కోసం ఎన్​సీఈఆర్​టీ బుక్స్,  న్యూమరికల్​ పార్ట్​ కోసం ప్రీవియస్​ పేపర్స్​ ప్రాక్టీస్​ చేశా. మొదటి నుంచీ నాకు ఇష్టమైన సబ్జెక్ట్​ ఫిజిక్స్​. ఆ సబ్జెక్ట్​ థియరీ పార్ట్​ కోసం ఎన్​సీఈఆర్​టీ బుక్స్​తోపాటు హెచ్​సీ వర్మ బుక్స్​ బాగా యూజ్​ అయ్యాయి. న్యూఢిల్లీ ఎయిమ్స్​లో మెడిసిన్​ పూర్తి చేసి కార్డియాలజిస్ట్​ అవ్వాలన్నది నా డ్రీమ్​.

పేరెంట్స్​ ప్రోత్సాహంతో..-ఆకాంక్ష సింగ్ (ఆలిండియా ర్యాంక్-2)

ఉత్తరప్రదేశ్​లోని ఖుషీనగర్​ జిల్లా అభినాయక్​పూర్ మా గ్రామం​. నాన్న రాజేంద్ర కుమార్​ ఎయిర్​ఫోర్స్​ రిటైర్డ్​ ఆఫీసర్​. అమ్మ రుచిసింగ్​ ప్రైమరీ స్కూల్​ టీచర్​. స్కూలింగ్​ అంతా ఊర్లోనే.  9వ తరగతి చదవుతున్నప్పుడే నాన్న నన్ను నీట్​ కోచింగ్​కు పంపించారు. లోకల్​గా కోచింగ్​ సెంటర్లు లేకపోవడంతో రోజూ దాదాపు 70 కిలోమీటర్లు బస్సులో ప్రయాణించి గోరఖ్​పూర్​లో ఇన్​స్టిట్యూట్​కు వెళ్లేదాన్ని. అమ్మ నన్ను రోజూ బస్సెక్కించి.. తిరిగి తీసుకెళ్లేది. ఒక్కో రోజు ఇంటికొచ్చేసరికి రాత్రి తొమ్మిదిన్నర దాటేది. నాన్న నా స్టడీ కోసం తొందరగా రిటైర్మెంట్​ తీసుకున్నారు. నా కోసం పేరెంట్స్​ పడుతున్న కష్టాలను చూసి ఎలాగైనా మంచి ర్యాంక్​ సాధించాలనే కసి పెరిగింది. అందుకు బాగా కష్టపడ్డాను. స్కూలు అయిపోయాక కోచింగ్​ కోసం బస్సులో ట్రావెల్​ చేసేటప్పుడు కూడా కొన్ని టాపిక్స్​ చూసుకునేదాన్ని. ఎప్పుడైనా ప్రెజర్​గా అనిపిస్తే మ్యూజిక్​ వినేదాన్ని. ఎస్పెషల్లీ అరిజిత్​ సింగ్​ సాంగ్స్​. మోటివేషనల్​ స్పీకర్​ సందీప్​ మహేశ్వరి మాటలు నాకు బాగా స్ఫూర్తినిచ్చాయి.

రోజుకు 12 గంటలు: నీట్​లో టాప్​ ర్యాంక్​ కొట్టి న్యూఢిల్లీ  ఎయిమ్స్​లో మెడిసిన్​ చదవాలనే లక్ష్యంతో రోజుకు 10 నుంచి 12 గంటలు ప్రిపేరయ్యేదాన్ని. ఇన్​స్టిట్యూట్​ స్టడీ మెటీరియల్​తోపాటు ఎన్​సీఈఆర్​టీ బుక్స్​ రెఫర్​ చేస్తూ.. కాన్సెప్ట్​ ఓరియెంటెడ్​ మెథడ్​లో ఎగ్జామ్​కు సన్నద్ధమయ్యాను. ఫిజిక్స్​ కోసం అనురాగ్​ మిశ్రా, ఐఈ ఇరోడొవ్​, బయాలజీ కోసం క్యాంప్​బెల్​, కెమిస్ట్రీ కోసం ఎన్​సీఆర్​టీ బుక్స్​ ఫాలో అయ్యాను. లాక్​డౌన్​ పీరియడ్​ నాకు దొరికిన ఎక్స్​ట్రా టైంగా భావించి అన్ని చాప్టర్స్​ ఒకటికి రెండు సార్లు రివైజ్​ చేయగలిగా. న్యూరోసర్జరీకి మంచి భవిష్యత్తు ఉంది, అదే ఫీల్డ్​లో పని చేయాలని అనుకుంటున్న. ఫైనల్​గా నా సక్సెస్​కు హార్డ్​వర్క్‌, స్మార్ట్​ వర్క్‌ రెండూ కారణమే.

ఫుల్​ హ్యాపీ.. -తుమ్మల స్మిత (ఆలిండియా ర్యాంక్-3)

తెలంగాణ స్టేట్​ నుంచి ఆలిండియా థర్డ్​ ర్యాంక్​ రావడం ఆనందంగా ఉంది. నాన్న సదానంద్​ రెడ్డి కార్డియాలజిస్ట్​, అమ్మ లక్ష్మి గైనకాలజిస్ట్​. అమ్మానాన్నలాగే నాకూ డాక్టరవ్వాలని చిన్నప్పటి నుంచి ఉండేది. టెన్త్​ వరకు నాచారంలోని ఢిల్లీ పబ్లిక్​ స్కూల్​లో చదివా. ఇంటర్​కు శ్రీచైతన్యలో చేరా. రోజూ 8.30 నుంచి సాయంత్రం 4 వరకు క్లాసెస్​ కొంతసేపు బ్రేక్​ తర్వాత స్టడీ అవర్స్​ ఇలా నీట్​ కోసం రెండేండ్లు ప్రిపేరయ్యా..  ఇతర కార్యక్రమాలకు పెద్దగా వెళ్లేదాన్ని కాదు. నీట్​లో టాప్​ ర్యాంక్​ సాధిస్తే బెస్ట్​ ఇన్​స్టిట్యూట్​లో మెడిసిన్​ చేయొచ్చనే లక్ష్యంగా పెట్టుకొని చదివా. ఐపీఈ ఎగ్జామ్స్​కు లాస్ట్​ నెల మాత్రమే ప్రిపేరయ్యా. ఇంటర్​లో 971 మార్క్స్​ వచ్చాయి.

ఎన్​సీఆర్​టీ బుక్స్​ కీలకం

నీట్​కు ప్రిపేరయ్యే స్టూడెంట్స్​ ఐపీఈ సిలబస్​తోపాటు ఎన్​సీఈఆర్​టీ బుక్స్​ కచ్చితంగా రెఫర్​ చేయాలి. దాదాపు 90 శాతం  ప్రశ్నలు ఎన్​సీఈఆర్​టీ బుక్స్​ నుంచే వచ్చే చాన్స్​ ఉంటుంది. నీట్​లో బయాలజీ, ఫిజిక్స్​, కెమిస్ట్రీ సబ్జెక్టులకు సంబంధించి రోజువారిగా లెక్చరర్స్​ చెప్పిన క్లాస్​ నోట్స్​, కాలేజీలో ఇచ్చిన మెటీరియల్​ పూర్తిగా చదవడంతోపాటు రెండు మూడు సార్లు రివిజన్​ చేశా.  మొదటి నుంచి అన్ని సబ్జెక్ట్​లకు సరైన ప్రాధాన్యత ఇచ్చా. బాగా వచ్చిన సబ్జెక్టే కదా అని ఎక్కడా నిర్లక్ష్యం చేయలేదు. అయినప్పటికీ​ ఫిజిక్స్​లో ఒక మార్కు తగ్గింది. రోజుకు ఎన్నిగంటలు చదివామన్నది కాకుండా ఎంత ఎఫీషియెంట్​గా చదివామన్నది ఇంపార్టెంట్​. కన్​సిస్టెన్సీ ఉండాలి. రోజుకు 10 నుంచి 16 గంటలు ఏకదాటిగా చదవడం కంటే మధ్య మధ్యలో బ్రేక్స్​ ఇస్తూ చదవడం బెటర్​. కిందటి రోజు చదివింది ఒకసారి రివైజ్​ చేసుకొని ఆరోజు చాప్టర్స్​ మొదలు పెడితే బాగా గుర్తుండిపోతాయి. లాక్​డౌన్​ టైం రివిజన్​కు బాగా ఉపయోగపడింది. కొన్ని టాపిక్స్​ గుర్తుండడానికి ఎన్​సీఈఆర్​టీ బుక్స్​ నుంచి సొంతంగా నోట్స్​ ప్రిపేర్​ చేసుకొని చదివా. నీట్​ ప్రిపరేషన్​కు నెట్ ను కూడా యూజ్​ చేశా. పర్టిక్యులర్​ గా కొన్ని​ చాప్టర్స్​లోని క్వశ్చన్స్​ ప్రాక్టీస్​ చేయడానికి నెట్​లో​ ఫ్లాష్​ కార్డ్స్​ చేశా. టాపిక్​ వైజ్​ పెడగాగి టెస్ట్​ సిరీస్​, ప్రీవియస్​ పేపర్స్​ ప్రాక్టీస్​ చేశా. ఢిల్లీ ఎయిమ్స్​లో మెడిసిన్​ చేస్తా.