డంప్ యార్డు సమస్య పరిష్కారానికి కృషి : వెలిచాల రాజేందర్ రావు

డంప్ యార్డు సమస్య పరిష్కారానికి కృషి : వెలిచాల రాజేందర్ రావు
  •  వెలిచాల రాజేందర్ రావు 

కరీంనగర్, వెలుగు: సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఇండోర్ తరహాలోనే కరీంనగర్ డంప్ యార్డ్ సమస్యను పరిష్కరించేందుకు తాను కృషి చేస్తానని కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌చార్జి వెలిచాల రాజేందర్ రావు తెలిపారు. బుధవారం మానేరు ఒడ్డున ఉన్న  డంపింగ్ యార్డును పరిశీలించారు.  ఈ సందర్భంగా వెలిచాల మాట్లాడుతూ కరీంనగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు డంపింగ్ యార్డు సమస్య తీవ్రంగా ఉందని, ప్రజలు శ్వాసకోశ క్యాన్సర్ ఇతర వ్యాధుల బారిన పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ సమస్యకు పరిష్కార మార్గం కనుగొనేందుకే స్వయంగా డంప్ యార్డ్ పరిశీలించేందుకు వచ్చానని తెలిపారు. ఇండోర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో కరీంనగర్ జిల్లావాసి పరికిపండ్ల నరహరి మున్సిపల్ కమిషనర్ గా పనిచేశారని,  ఆయన హయాంలో ఇండోర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను దేశంలోనే ఆదర్శ సిటీగా తీర్చిదిద్దారని చెప్పారు. డంపింగ్ యార్డు సమస్య పరిష్కారానికి సూచనలు ఇచ్చేందుకు ఆయనను ప్రత్యేకంగా ఆహ్వానించినట్లు తెలిపారు. కార్యక్రమంలో కాంగ్రెస్ లీడర్లు వైద్యుల అంజన్ కుమార్, కట్ల సతీశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, పడిశెట్టి భూమయ్య, నరసన్న, శ్రీనివాస్, శ్రీనివాసరావు, రాజశేఖర్, భూమా గౌడ్, విలాస్ రెడ్డి, మోహన్ 
పాల్గొన్నారు.