రైతు సంక్షేమానికి పెద్దపీట : ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం

రైతు సంక్షేమానికి పెద్దపీట : ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం
  • చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం 

బోయినిపల్లి,వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం రైతుల సంక్షేమానికి పెద్దపీట వేస్తోందని చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం అన్నారు. బుధవారం రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి మండల కేంద్రంలో నిర్వహించిన రైతు భరోసా సంబరాల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ దేశంలో ఏ రాష్ట్రం చేయని విధంగా ఏడాదిన్నరలో రైతుల సంక్షేమం కోసం వివిధ పథకాలకు రూ. లక్షా 4 వేల కోట్లు ఖర్చు చేసిందన్నారు. అంతకుముందు గ్రామంలో భారీ ర్యాలీ నిర్వహించారు. బోనాలతో ఎమ్మెల్యేకు మహిళలు ఘన స్వాగతం పలికారు. 

అనంతరం కంది విత్తనాల సంచులను రైతులకు అందజేశారు. కాంగ్రెస్ బీసీ సెల్ జిల్లా  అధ్యక్షుడు రవీందర్, పార్టీ మండల అధ్యక్షుడు రమణారెడ్డి, ఏఎంసీ చైర్మన్ ఎల్లేష్ యాదవ్, వైస్ చైర్మెన్  వినోద్ రెడ్డి, పీఏసీఎస్  చైర్మన్లు వెంకటరామారావు, సురేందర్ రెడ్డి, సెస్ డైరెక్టర్ సుధాకర్  పాల్గొన్నారు