వర్షం పడితే.. బడి చెరువే .. ఇబ్బంది పడుతున్న విద్యార్థులు

వర్షం పడితే.. బడి చెరువే .. ఇబ్బంది పడుతున్న విద్యార్థులు

మరికల్, వెలుగు: పస్పుల ప్రాథమిక పాఠశాల విద్యార్థులు ఏటా వర్షపు నీటితో ఇబ్బంది పడుతున్నారు. వాన పడితే స్కూల్​ఆవరణ చెరువును తలపిస్తోంది. చుట్టూ ఇళ్లన్నీ ఎత్తులో ఉన్నాయి. దీంతో ఇటీవలే బడికి ప్రహరీ నిర్మించారు. కానీ, పాఠశాల ప్రాంగణంలో నిలిచే వర్షపు నీరు బయటకు వెళ్లేందుకు ఎలాంటి ఏర్పాట్లు చేయలేదు. 

మంగళవారం అర్ధరాత్రి నుంచి కురిసిన వర్షానికి బడి ఆవరణ జలమయమైంది. బుధవారం విద్యార్థులు అందులో నుంచే నడుస్తూ క్లాస్​కు వెళ్లారు. ప్రార్థన చేయలేదు. మోటార్లు పెట్టి, నీరు బయటకు పంపించే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది. ఏండ్ల క్రితం నిర్మించిన పాఠశాల భవనాలను కూల్చి, కొత్తగా నిర్మిస్తేనే సమస్య పరిష్కారమవుతుందని గ్రామస్తులు అంటున్నారు.