ఉదయం 11 దాటినా ఒక్క అధికారి రాలే .. నాగర్ కర్నూల్ తహసీల్దార్ కార్యాలయంలో పరిస్థితి

ఉదయం 11 దాటినా ఒక్క అధికారి రాలే .. నాగర్ కర్నూల్ తహసీల్దార్ కార్యాలయంలో పరిస్థితి

నాగర్ కర్నూల్ టౌన్, వెలుగు: నాగర్ కర్నూల్ తహసీల్దార్ కార్యాలయానికి బుధవారం ఉదయం 11 గంటలు దాటినా ఒక్క అధికారి రాలేదని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము వివిధ సమస్యలపై దరఖాస్తులు ఇచ్చేందుకు వచ్చి, పడిగాపులు కాస్తుంటే అధికారుల తమ ఇష్టం వచ్చిన సమయానికి వస్తున్నారని ఆరోపించారు. 

అనంతరం ఖాళీ కుర్చీలను వీడియో తీసి, సోషల్ మీడియాలో పోస్ట్​చేయగా వైరల్​అయింది.