NEET PG 2024 ఎగ్జామ్ వాయిదా

NEET PG 2024 ఎగ్జామ్ వాయిదా

ప్రభుత్వ, ప్రైవేట్ కళాశాలల్లో MD/MS, PG డిప్లొమా కోర్సులలో ప్రవేశానికి ఎంట్రన్స్ టెస్ట్ NEET PG 2024 వాయిదా పడింది. NEET రాస్తున్న  అభ్యర్థులు నీట్ పీజీ పరీక్ష రివైజ్డ్ షెడ్యూల్ ను అధికారిక వెబ్ సైట్ nbe.edu.in, natboard,.edu.inలో చూసుకోవచ్చు. 

నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జిమినేషన్స్ ఇన్ మెడికల్ సైన్సెస్ (NBEMS) నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ పోస్ట్ గ్రాడ్యుయేట్(NEET PG) 2024  కొత్త షెడ్యూల్ ను విడుదల చేసింది. తాజా ప్రకటన ప్రకారం NEET PG 2024 పరీక్షను 2024 జూలై 7, NEET PG 2024 హజరు కావడానికి అర్హత పరీక్ష కోసం కటాఫ్ తేదీని 2024 ఆగస్టు 15గా నిర్ణయించారు. ఈ పరీక్షలు మార్చి 3 2024న నిర్వహించాల్సి ఉండగా వాయిదా పడ్డాయి.